3, ఫిబ్రవరి 2014, సోమవారం

హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (Husnabad Assembly Constituency)

హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నియోజకవర్గాల పునర్విభనలో ఇది కొత్తగా ఏర్పాటైంది. ఈ నియోజవర్గంలో 6 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • చిగురుమామిడి,
  • కోహెడ,
  • హుస్నాబాద్,
  • సైదాపూర్,
  • భీమదేవరపల్లి,
  • ఎల్కతుర్తి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎ.ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మీకాంతరావు తెరాస
2014 ఒడితెల సతీష్ కుమార్ తెరాస ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 ఒడితెల సతీష్ కుమార్ తెరాస చాడా వెంకటరెడ్డి సీపీఐ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎ,ప్రవీణ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి లక్ష్మీకాంతరావుపై 13575 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం అఈపీఐకు కేటాయించగా ఆ పార్టీ చాడ వెంకటరెడ్డిని బరిలోకి దింపగా తెరాసకు కూడా లక్ష్మీకాంతరావును పోటీలోకి దింపింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, ఒడితెల సతీష్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డిపై 34269 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున వడితెల సతీష్ కుమార్, భాజపా తరఫున చాడ శ్రీనివాస్ రెడ్డి, జనకూటమి తరఫున సీపీఐకి చెందిన చాడ వెంకట్‌రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన సతీశ్ కుమార్ ఒడితెల తన సమీప ప్రత్యర్థి, సీపీఐకు చెందిన చాడా వెంకటరెడ్డి పై 70530 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, హుస్నాబాద్  అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక