7, మార్చి 2014, శుక్రవారం

దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeshwari)

దగ్గుబాటి పురంధేశ్వరి
జననం22 ఏప్రిల్, 1959
పదవులుకేంద్రమంత్రి (2004-2014)
నియోజకవర్గంబాపట్ల లో/ని (2004-09), విశాఖపట్టణం  లో/ని (2009-14)
దగ్గుబాటి పురంధరేశ్వరి 22 ఏప్రిల్, 1959న చెన్నైలో జన్మించారు. బీఏ వరకు అభ్యసించారు. ఈమె ప్రముఖ తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు కూతురు. 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014 మార్చిలో భారతీయ జనతా పార్టీలోచేరారు. ఈమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయనాయకుడిగా పేరుపొందారు.

రాజకీయాలు:
పురంధేశ్వరి 2004లో బాపట్ల లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంత్రి పదవి పొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009లో విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై మరోసారి కేంద్రమంత్రి అయ్యారు. 2014మార్చిలో భారతీయ జనతాపార్టిలో చేరారు. 2014లో భాజపా తరఫున రాజంపేట లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. జూలై 3, 2015న భాజపా జాతీయ మహిళా మోర్చా ఇంచార్జిగా నియమించబడ్డారు.

బంధుత్వాలు:
ఈమెకు ఏడుగురు సొదరులు, ముగ్గురు సోదరిలు. సొదరులు హరికృష్ణ, బాలకృష్ణ నటులుగా, రాజకీయ నాయకులుగా పేరుపొందారు. సోదరి భువనేశ్వరి భర్త నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1991లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు.


విభాగాలు: బాపట్ల లోకసభ నియోజకవర్గం, విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం, కేంద్రమంత్రులు, 1959లో జన్మించినవారు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

  Index


  తెలుగులో విజ్ఞానసర్వస్వము
  వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
  ప్రపంచము,
  శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
  క్రీడలు,  
  క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
  శాస్త్రాలు,  
  భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
  ఇతరాలు,  
  జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

    విభాగాలు: 
    ------------ 

    stat coun

    విషయసూచిక