20, మార్చి 2014, గురువారం

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం (Medak Assembly Constituency)

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 4 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014 & 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ

1957 వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ

1962 కె.ఆనందదేవి సి.పి.ఐ ఎస్.కె.రెడ్డి ఇండిపెండెంట్
1967 కె.రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీ కె.సంగమేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్
1972 కె.రామచందర్ రావు ఇండిపెండెంట్ దేవేందర్ కాంగ్రెస్ పార్టీ
1978 ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్-ఐ కె.రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీ
1983 కె.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 కె.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ ఎం.ఎన్.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ
1989 పి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ
1994 కె.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ పి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కె.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ పి.జె.విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2002 కె.ఉమాదేవి తెలుగుదేశం పార్టీ పి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 పి.శశిధర్ రెడ్డిజనతా పార్టీ కె.ఉమాదేవి తెలుగుదేశం పార్టీ
2009 మైనంపల్లి హన్మంతరావు తెలుగుదేశం పార్టీ పి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 పద్మా దేవేందర్ రెడ్డి తెరాస విజయశాంతి కాంగ్రెస్ పార్టీ
2018 పద్మా దేవేందర్ రెడ్డి తెరాస ఉపేందర్ రెడ్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ కి చెందిన పట్లోళ్ళ శశిధర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం ఉమాదేవి‌పై 4449 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. శశిధర్ రెడ్డికి 43369 ఓట్లు రాగా, ఉమాదేవికి 38920 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జిల్లా తెదేపా అధ్యక్షుడు, రామాయంపేట సిటింగ్ అమ్మెల్యే అయిన మైనంపాటి హన్మంతరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టికి చెందిన పటోళ్ల శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున మెదక్ పురపాలక సంఘం చైర్మెన్ పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన పద్మా దేవేందర్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మెదక్ సిటింగ్ ఎంపి అయిన విజయశాంతిపై 39600 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పద్మా దేవేందర్ డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పద్మాదేవేందర్ రెడ్డి, భాజపా తరఫున ఆకుల రాజయ్య, జనకూటమి తరఫున తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన కొలుకూరి జనార్థన్ రెడ్డి చేశారు. తెరాసకు చెందిన పద్మా దేవేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపేదర్ రెడ్డి పై 47983 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక