22, మార్చి 2014, శనివారం

ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah)

ఆర్.కృష్ణయ్య
జననంజనవరి 13, 1954
స్వస్థలంరాళ్లగుడుపల్లి
జిల్లావికారాబాదు జిల్లా
పార్టీతెలుగుదేశం పార్టీ
ర్యాగ కృష్ణయ్య వికారాబాదు జిల్లా మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామంలో జనవరి 13, 1954న పెద్ద జమీందారు కుటుంబంలో జన్మించారు. మోమిన్‌పేటలో 10వ తరగతి, సంగారెడ్డిలో ఇంటర్మీడియట్, వికారాబాదులోని అనంతపద్మనాభ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎం, ఎం.ఫిల్ పట్టాలు పొందారు. గత మూడున్నర దశాబ్దాలుగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమంకై కృషిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కృష్ణయ్య 2014 మార్చి 29న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ విద్యలో ఉన్నప్పుడే విద్యార్థుల సంక్షేమంపై ఆందోళన చేపట్టారు. డిగ్రీ తర్వాత బ్యాంకు ఉద్యోగం పొందిననూ రెండు రోజులకే రాజీనామా చేసి ఉద్యమబాట పట్టారు. 1970-84 కాలంలో పలు ఉద్యమ కమిటీలను ముందుండి నడిపించారు. బిసి గర్జన మేగజైన్‌ను స్థాపించి సంపాదకత్వం వహిస్తున్నారు.

భార్య శబరీదేవి గ్రూప్-1 అధికారిణి. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు.
 
 
ఇవి కూడా చూడండి:




హోం,
విభాగాలు:
వికారాబాదు జిల్లా ప్రముఖులు, మోమిన్‌పేట మండలం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక