23, మార్చి 2014, ఆదివారం

సింగోటం (Singotam)

సింగోటం గ్రామము
గ్రామముసింగోటం 
మండలముకొల్లాపూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3048 (2001)
2919 (2011)
సింగోటం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణం 839 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది.

జవాయిపలి ఈ పంచాయతి శివారు గ్రామం. పశువుల సంత, తైబజారువల్ల పంచాయతీకి అధిక ఆదాయం వస్తుంది. ప్రతి బుధవారం పశువుల సంత జరుగుతుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇది పెద్ద పశువుల సంత. 1956లో గ్రామంలో పాఠశాల ఏర్పడింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3048. ఇందులో పురుషులు 1519, మహిళలు 1529. గృహాల సంఖ్య 692.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2919. ఇందులో పురుషులు 1457, మహిళలు 1462. గృహాల సంఖ్య 721.
రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా ఇమ్మడి వెంకటస్వామి ఎన్నికయ్యారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం:
ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింగోటం గ్రామంలో ఉంది. ఏటా మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సుమారు 500 సంవత్సరాల క్రితం జటప్రోలు సంస్థానాన్ని సురభివంశ 11వ రాజు సింగమనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది.  సురభి సంస్థానాధీశులు ఈ ఆలయ నిర్వహణనకై 200 ఎకరాల భూమి కేటాయించారు.

విభాగాలు: కొల్లాపూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక