5, ఏప్రిల్ 2014, శనివారం

డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం (Dornakal Assembly Constituency)

డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • నర్సింహులపేట,
 • మరిపెడ,
 • కురవి,
 • డోర్నకల్,
నియోజకవర్గ చరిత్ర:
ఈ నియోజకవర్గానికి 2009 వరకు 13 సార్లు ఎన్నికలు జరుగగా 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. 2009లో తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. మంత్రిగా పనిచేసిన రెడ్యానాయక్ ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు.
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ

2009 సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
2014 రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ సత్యవతి రాథోడ్ తెరాస


1983 ఎన్నికలు:
1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జితేందర్ రెడ్డిపై 34244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. సురేందర్ రెడ్డికి 51038 ఓట్లు లభించగా, జితేందర్ రెడ్డికు 16794 ఓట్లు వచ్చాయి

2009ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్ పై 4623 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఇది తొలిసారి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన డి.ఎస్.రెడ్యానాయక్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి సత్యవతి రాథోడ్‌పై 23475 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక