2, ఏప్రిల్ 2014, బుధవారం

మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం (Miryalaguda Assembly Constituency)

మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 3 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 టి.చిన్న కిశోర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సీపీఎం
1967 టి.చిన్న కిశోర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సీపీఎం
1972 టి.చిన్న కిశోర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.ఎస్.రామయ్య సీపీఎం
1978 ఏ.లక్ష్మీనారాయణ సీపీఎం టి.లింగయ్య కాంగ్రెస్-ఐ
1983 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ ఏ.లక్ష్మీనారాయణ సీపీఎం
1985 ఏ.లక్ష్మీనారాయణ సీపీఎం జి.చిలినమ్మ కాంగ్రెస్ పార్టీ
1989 టి.విజయసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ.లక్ష్మీనారాయణ సీపీఎం
1994 జూలకంటి రంగారెడ్డి సీపీఎం టి.విజయసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 రేపల్లె శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అరుణ సుందరి తెలుగుదేశం పార్టీ
2004 జూలకంటి రంగారెడ్డి సీపీఎం పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 జూలకంటి రంగారెడ్డి సీపీఎం టి.గంగాధర్‌ కాంగ్రెస్ పార్టీ
2014 ఎన్.భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ అమరేందర్ రెడ్డి తెరాస
2018 నల్లమోతు భాస్కర్ రావు తెరాస ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన జూలకంటి రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రశేఖరరెడ్డిపై 31155 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. రంగారెడ్డి 81014 ఓట్లు పొందగా, చంద్రశేఖరరెడ్డికి 49859 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.గంగాధర్‌పై 4363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.భాస్కరరావు తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి అమరేందర్ రెడ్డిపై 5811 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఎన్.భాస్కర్ రావు, భాజపా తరఫున కర్నాటి ప్రభాకర్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్.కృష్ణయ్య పోటీచేశారు. తెరాసకు చెందిన నల్లమోతు భాస్కర్ రావు తన సమీప ప్రత్యర్థి, బిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్.కృష్ణయ్య పై 30652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక