17, ఏప్రిల్ 2014, గురువారం

వరంగల్ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం (Warangal West Assembly Constituency)

వరంగల్ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. వరంగల్ మండలం (పాక్షికం) మరియు వరంగల్ నగరపాలక సంస్థ (పాక్షికం) కలవు. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • వరంగల్ మండలం (పాక్షికం),
 • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 డి.వినయ్ కుమార్ తెరాస దయాసాగర్‌ కాంగ్రెస్ పార్టీ
2010* డి.వినయ్ కుమార్ తెరాస దయాసాగర్‌ కాంగ్రెస్ పార్టీ
2014 దాస్యం వినయ్ భాస్కర్ తెరాస ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీ
2018 దాస్యం వినయ్ భాస్కర్ తెరాస రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి డి.వినయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయాసాగర్‌పై 6681 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో వినయ్ భాస్కర్ రాజీనామా చేయగా ఫిబ్రవరి 15, 2010న స్పీకర్ ఆమోదించారు.

2010 ఉప ఎన్నికలు:
2009లో విజయం సాధించిన వినయ్ భాస్కర్ రాజీనామా చేయడంతో జూలై 27, 2010న జరిగిన ఉప ఎన్నికలలో తెరాస నుంచి మళ్ళీ డి.వినయ్ కుమార్ పోటీచేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దయాకర్ రావుపై 67 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వినయ్‌కు 88435 ఓట్లు రాగా, దయాకర్‌కు 20924 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి 5762 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెరాసకు మద్దతు ఇచ్చింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన దాస్యం వినయ్ భాస్కర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎర్రబెల్లి స్వర్ణపై 55914 ఓట్ల భారీ మెజారిటితో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున దాస్యం వినయ్ భాస్కర్, భాజపా తరఫున మార్తినేని ధర్మారావు, ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన దాస్యం విజయ్ భాస్కర్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి పై 36451 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, వరంగల్ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక