20, మే 2014, మంగళవారం

బాపట్ల (Bapatla)

బాపట్ల
జిల్లా గుంటూరు జిల్లా
రెవెన్యూ డివిజన్తెనాలి
జనాభా 68103 (2001)


బాపట్ల గుంటూరు జిల్లాకు చెందిన పట్టణము. చారిత్రక పట్టణమైన బాపట్లలో చోళులు నిర్మించిన శ్రీభావనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ పట్టణము జిల్లా కేంద్రం గుంటూరు నుంచి 53 కిలోమీటర్ల దూరంలో గుంటూరు-చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. తెనాలి రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉన్న బాపట్ల అసెంబ్లీ మరియు లోకసభ నియోజకవర్గ కేంద్రము. పట్టణ పురపాలక సంఘముచే నిర్వహించబడుతుంది. పట్టణానికి రైలు సదుపాయము కూడా కలదు. చెన్నై- కోల్కతా రైలు మార్గం బాపట్ల గుండా పోతుంది. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది. 2001 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 68103.


రవాణా సౌకర్యాలు:
బాపట్ల పట్టణం గుంటూరు నుంచి చీరాల వెళ్ళు రహదారిపై ఉండటం మరియు కోల్కత-చెన్నై రైలుమార్గం పట్టణం గుండా వెళ్ళుచుండటంతో ఈ పట్టణానికి మంచి రవాణా సౌకర్యాలున్నాయి. 

స్వాతంత్య్ర సమరంలో బాపట్ల:
స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఇక్కడీ ప్రజలు ఉద్యమించారు. 1913లో ప్రథమాంధ్ర మహాసభకు ఈ పట్టణం వేదికగా నిలిచింది. 1916లో హోంరూల్ ఉద్యమ సమయంలో ఇక్కడ భారీ సభ జరిగింది. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను విద్యార్థులు బహిష్కరించారు. వీరికోసం బాపట్లలో 1921 ఫిబ్రవరిలో ఒక జాతీయ కళాశాల నెలకొల్పబడింది. 1921లో చీరాల-పేరాల ఉప్పుసత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బాపట్ల బోర్డు హైస్కూల్ విద్యార్థి. 1923 మే నెలలో బాపట్లకు చెందిన ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు భట్టిప్రోలు సూర్యప్రకాశరావు నాగపూర్ వెళ్ళి నాగపూర్ జెండా సత్యగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఉప్పు తయారు చేయడానికి, నిల్వచేయడానికి బాపట్ల సమీపంలోని గణపవరం ఒక కేంద్రంగా ఎంపిక చేయబడింది. 1921 మార్చి 30న అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన మహాత్మాగాంధీ తన పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రప్రథమంగా బాపట్లను సందర్శించారు.1934లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు బాబురాజేంద్రప్రసాద్ బాపట్ల సందర్శించి టౌన్‌హాలులో జరిగిన సభలో ప్రసంగించారు. 1936వ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ బాపట్ల సందర్శించి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన సభలో ప్రసంగించారు.

భావనారాయణస్వామి ఆలయం:
శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయము తెలుగు ప్రాంతములోని ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇది సుమారు 1400 సంవత్సరాలకు పూర్వము చోళుల చే నిర్మితమైనది. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలున్నాయి.ప్రతిఏటా వేసవికాలంలో వైభవంగా జరిగే తిరునాళ్ల (బ్రహ్మోత్సవాలు)కు లక్షల సంఖ్యలో భక్తులు హాజరౌతారు.

విభాగాలు: గుంటూరు జిల్లా పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, బాపట్ల మండలము, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక