19, మే 2014, సోమవారం

ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dayakararao)

ఎర్రబెల్లి దయాకర్ రావు
జననం
స్వస్థలంపర్వతగిరి
పదవులు5సార్లు ఎమ్మెల్యే,
పార్టీతెలుగుదేశం పార్టీ
ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. పర్వతగిరికి చెందిన దయాకర్ రావు ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించినారు. 1983లో తొలిసారి శాసనసభకు పోటీచేసి ఓడిపోయిననూ 1994 నుంచి వరసగా 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
దయాకర్ రావు 1982లోనే ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో తొలిసారి వర్థన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి అధిష్టించారు. 1994లో వర్థన్నపేట నుంచి విజయం సాధించి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో వరసగా రెండోసారి ఎన్నికైనారు. 2004లో కూడా వర్థన్నపేట నుంచి గెలుపొంది 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో పాలకుర్తి ఎస్సీ రిజర్వ్ కావడంతో 2009లో పాలకుర్తి నుంచి ఎన్నికై వరసగా 4వసారి శాసనసభ్యులైనారు. 2014లో దుగ్యాల శ్రీనివాస్ రావుపై గెలుపొంది 5వసారి శాసనసభలో ప్రవేశించారు. 2014, జూన్ 10న ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేతగా నియమితులైనారు.


విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 14వ శాసనసభ సభ్యులు


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక