3, మే 2014, శనివారం

ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం (Ichapuram Assembly Constituency)

ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలున్నాయి. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 120. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 1 గా మారింది. ఇది రాష్ట్రంలోనే అతి తూర్పున ఉన్న నియోజకవర్గం.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • ఇచ్ఛాపురం,
 • సోంపేట,
 • కంచిలి,
 • కవిటి,

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 నరేష్ కుమార్ అగర్వాల్ కాంగ్రెస్ పార్టీ యాకాంబరి డక్కాట తెలుగుదేశ పార్టీ
2009 సాయిరాజ్ తెలుగుదేశం పార్టీ ఎన్.రామారావు కాంగ్రెస్ పార్టీ
2014 బెందాళం అశోక్ తెలుగుదేశం పార్టీ నర్తు రామారావు వైకాపా
2019 బెందాళం అశోక్ తెలుగుదేశం పార్టీ పిరియ సాయిరాజ్ వైకాపా

2004 ఎన్నికలు:
2004లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశ పార్టీ అభ్యర్థి అయిన యాకాంబరి డక్కాటపై 7719 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నరేష్ కుమార్‌కు 51901 ఓట్లు రాగా యాకాంబరికి 44182 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాయిరాజ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.రామారావుపై 2275 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన బెందాళం అశోక్ తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన నర్తు రామారావుపై 25038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ బెందాళం తన సమీప ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన పిరియ సాయిరాజ్ పై 7145 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక