హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఏప్రిల్ 1,1889న నాగ్పూర్‌లో జన్మించారు. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా కందకుర్తి గ్రామానికి చెందినవారు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు.
స్వామి వివేకానంద మరియు అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై హెడ్గేవార్ ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు. హెడ్గేవార్ వైద్యవిద్యను అభ్యసించుటకు కోల్ కతా వెళ్ళినపుడు బెంగాల్ లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి అనుశీలన సమితి మరియు జుగాంతర్ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. ఈయన 1929 వరకు హిందూ మహాసభ లో సభ్యునిగా ఉన్నారు. హెడ్గేవార్ బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో 1921 లో ఒక సంవత్సరం మరలా 1930 లో 9 నెలలు జైలుశిక్ష ననుభవించారు. హెడ్గేవార్ జూన్ 21, 1940న మరణించారు.
= = = = =
|
Tags:Hedgewar Essay in telugu, RSS leaders information in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి