1, అక్టోబర్ 2017, ఆదివారం

మహాత్మాగాంధీ (Mahatma Gandhi)

జననంఅక్టోబరు 2, 1869
జన్మస్థానంపోరుబందర్ (గుజరాత్)
రంగంస్వాతంత్ర్యోద్యమ నాయకుడు
మరణంజనవరి 30, 1948
మహాత్మాగాంధీ అసలుపేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీ అక్టోబరు 2, 1869న గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌లో జన్మించారు. అహింస సిద్ధాంతం ద్వారా బ్రిటీష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన వారిలో ఈయన అగ్రగణ్యులు. కాబట్టి ఈయనకు భారత జాతిపితగా అభివర్ణిస్తారు. మహాత్మా అనేది ఈయన బిరుదము. ఇదే బిరుదంతో ఈయన మహాత్మాగాంధీగా ప్రసిద్ధిచెందారు. జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురైనారు.

గాంధీ తల్లిదండ్రులు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీ బాయి. పోరుబందర్, రాజ్‌కోట్‌లలో అభ్యసించిన గాంధీజీకి 13 సం.ల చిన్న వయస్సులోనే కస్తూరిబాతో వివాహమైంది. న్యాయశాస్త్ర విద్యకై ఇంగ్లాండు వెళ్ళి బారిస్టర్ పట్టా పుచ్చుకొని బొంబాయి, రాజ్‌కోట్‌లలో న్యాయవాదిగా కొంతకాలం పనిచేశారు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌ వెళ్ళి న్యాయవాద వృత్తి చేపట్టారు. ఒకసంవత్సరం కాంట్రాక్టు మీద వెళ్ళిన గాంధీజీ 21 సంవత్సరాఅ సుధీర్ఘకాలం దక్షిణాఫ్రికాలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో భారత్‌లో వలె అక్కడ కూడా బ్రిటీష్ వారు స్థానికులను హీనంగా చూడటం గమనించాడు. ఒకసారి గాంధీజీ మొదటిశ్రేణి టికెట్ కొని రైలులో ఎక్కిననూ తెల్లవాడు కానందున బ్రిటీష్ రైలు అధికారులు రైలునుంచి తోసివేశారు. ఆ సంఘటన గాంధీజీ ఆలోచన ధోరణిని మార్చివేసింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పత్రికలో వ్యాసాలు వ్రాయడం, సంస్థలు స్థాపించడం జరిగింది. సత్యాగ్రహం అనే ఆయన ఆయుధాన్ని కూడా అక్కడే తొలిసారి ప్రయోగించాడు. స్థానికులపై, ముఖ్యంగా అక్కడి భారతీయులపై బ్రిటీష్ వారి దౌర్జన్యాలను ప్రతిఘటించాడు.

మహాత్మాగాంధీ  
జనరల్ నాలెడ్జి / క్విజ్
1915లో గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చిన పిదప గోపాల కృష్ణ గాంధీ శిష్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొన్నాడు. బీహార్‌లోని చంపారన్ ఉద్యమానికి తొలిసారి నాయకత్వం వహించి విజయం సాధించాడు. ఆ తర్వాత రౌలత్ చట్టానికి, జలియన్ వాలా బాగ్ దురంతానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి బ్రిటీష్ అధికారులచే జైలుశిక్షలకు గురై దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. 1924లో స్వయంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1927లో సైమన్ కమీషన్ వ్యతిరేక ఉద్యమం, 1930 పూర్ణస్వరాజ్ దినోత్సవంలలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా 1930 ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించి స్వాతంత్ర్యోద్యమ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ సంఘటనతో గాంధీజీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. 1932లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి భారత ప్రతినిధిగా హాజరైనాడు.
దండి సత్యాగ్రహంలో గాంధీజీ

కాంగ్రెస్‌లోని కొందరు అతివాదులతో విబేధాలు వచ్చిననూ తన శాంతి, అహింస సిద్ధాంతాలను వదిలిపెట్టలేడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం, 1939-45లో రెండో ప్రపంచయుద్ధం సంఘటనల తర్వాత బ్రిటీష్ వారు భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికై 1946లో కేబినెట్ మిషన్ ఏర్పాటుచేశారు. భారత్‌ను భారత్-పాకిస్తాన్‌లుగా విభజించే ప్రతిపాదనను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించిననూ బ్రిటీషర్లు దేశాన్ని రెండుగా విభజించారు. దేశ విభజన అనంతరం జరిగిన మతకలహాలపై గాంధీజీ తీవ్ర కలతకు గురైనారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో కృషిచేసిన గాంధీజీ స్వాతంత్ర్యానంతరం ఎలాంతి పదవులు స్వీకరించలేదు. స్వాతంత్ర్యం పొందిన ఐదు నెలల స్వల్ప కాలంలోనే జనవరి 30, 1948న పిస్టల్ కాల్పుకు గురై ప్రాణాలు కోల్పోయారు. గాంధీజీ వర్థంతిని అమరవీరుల దినంగా జరుపుకుంటారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: స్వాతంత్ర్యోద్యమ నాయకులు, 1869, 1948, గుజరాత్ ప్రముఖులు


 = = = = =Tags: about Mahatma Gandhi Essay in Telugu, Gandhi Jeevitha Charitra, Telugulo Gandhi, Telugulo Mahatma Gandhi, Mohandas Karam Chand Gandhi in Telugu, Biography of Gandhi in Telugu, Indian National Leaders Essays in Telugu, Fredom Struggle Leaders in Telugu, Famous Persons of India in Telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక