7, జూన్ 2014, శనివారం

బి.డి.జట్టి (B.D.Jatti)

బి.డి.జట్టి
జననంసెప్టెంబరు 10, 1912
స్వస్థలంసవాల్గి (కర్ణాటక)
పదవులుముఖ్యమంత్రి, గవర్నరు, ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి,
మరణంజూన్ 7, 2002
ముఖ్యమంత్రిగా, గవర్నరుగా, ఉప రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన బి.డి.జట్టి సెప్టెంబరు 10, 1912న కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా సవాల్గిలో జన్మించారు. ఇతని పూర్తిపేరు బసప్ప దానప్ప జట్టి. కొల్హాపూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొంది కొంతకాలం లా ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. పలు ఉన్నత రాజ్యాంగ పదవులు నిర్వహించి జూన్ 7, 2002న బి.డి.జట్టి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1940లో జాంఖండి పురపాలక సంఘం వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన జట్టి 1945లో పురపాలక సంఘం చైర్మెన్ అయ్యారు. ఆ తర్వాత జాంఖండి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. తదనంతరం జాంఖండి రాష్ట్ర దీవాన్ (ముఖ్యమంత్రి) అయ్యారు. జాంఖండి ముంబాయి రాష్ట్రంలో విలీనం కావడంతో కొంతకాలానికే ఇతను ముంబాయి ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. రాష్ట్రాల పునర్విభజన అనంతరం మైసూరు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించి ఎస్.నిజలింగప్ప తర్వాత మైసూరు ముఖ్యమంత్రి పదవి పొందారు.

1968లో జట్టి పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా, 1972లో ఒరిస్సా (ఒడిషా) గవర్నరుగా భాధ్యతలు చేపట్టారు. 1974లో భారతదేశ 5వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న కాలంలో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణించడంతో ఫిబ్రవరి 1977లో తాత్కాలిక రాష్ట్రపతిగా భాధ్యతలు స్వీకరించి జూలై 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వరకు పనిచేశారు. 

విభాగాలు: కర్ణాటక రాజకీయ నాయకులు, కర్ణాటక ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు, 1912లో జన్మించినవారు, 2002లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక