13, జూన్ 2014, శుక్రవారం

ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ (E. M. S. Namboodiripad)

 ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
జననంజూన్ 13, 1909
పదవులు2 సార్లు కేరళ ముఖ్యమంత్రి,
పార్టీసీపీఎం
మరణంమార్చి 19, 1998
భారతదేశ కమ్యూనిస్టు నాయకులలో ప్రసిద్ధుడైన ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జూన్ 13, 1909న ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని ఏలంకులంలో జన్మించారు. 1957లో కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికోబడిన తొలి కమ్యూనిస్టు నాయకుడిగానూ రికార్డు సృష్టించారు. 1967లో రెండోసారి కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ విభజన అనంతరం సీపీఎంకు నాయకత్వం వహించారు. నంబూద్రిపాద్ మార్చి 19, 1998న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1934లో నంబూద్రిపాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభాగమైన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సంస్థాపక సభ్యులుగా ఉన్నారు. 1934-40 కాలంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1939లోనే మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీపీఐలో చేరి ఆ పార్టీలో ముఖ్యుడిగా అవతరించారు. 1957లో కేరళలో కమ్యూనిస్టు పార్టీని గెలిపించి కేరళ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. దేశంలోనే తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రపంచంలోనే ప్రజాస్వామ్యపద్దతిలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు నాయకుడిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ భూసంస్కరణకై కృషిచేశారు. 1964లో సీపీఐలో విభజన తర్వాత సీపీఎంలో చేరి ఆ పార్టీ తరఫున 1967లో రెండోసారి నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు. 1969 నవంబరు వరకు పనిచేశారు.

విభాగాలు: కేరళ ముఖ్యమంత్రులు, సీపీఎం ప్రముఖులు, 1909లో జన్మించినవారు, 1998లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక