13, జూన్ 2014, శుక్రవారం

పద్మా దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy)

జననంజూన్ 6, 1969
స్వస్థలంరాంపూర్
పదవులుజడ్పీ చైర్మెన్, 2 సార్లు ఎమ్మెల్యే, శాసనసభ డి.స్పీ,
నియోజకవర్గంమెదక్ అ/ని,
పద్మా దేవేందర్ రెడ్డి జూన్ 6, 1969న కరీంనగర్ జిల్లా రాంపూర్‌లో జన్మించారు. బీఏ. ఎల్.ఎల్.బి.వరకు అభ్యసించి అడ్వకేట్‌గా ప్రాకెటీసు చేశారు. తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న పద్మా దేవేందర్ 2001లోనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కరీంనగర్ జడ్పీ చైర్మెన్‌గా, 2 సార్లు ఎమెల్యేగా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
2001లో తెరాసలో చేరిన పద్మా దేవేందర్ రెడ్డి అదే ఏడాది రామాయంపేట జడ్పీటీసిగా ఎన్నికై కరీంనగర్ జిల్లా పరిషత్తు చైర్మెన్ పదవి పొందారు. 2004లో రామాయంపేట నుంచి శాసనస్బహకు తొలిసారి ఎన్నికయ్యారు. 2009లో పొత్తులో భాగంగా పార్టీ టికెట్ లభించనందున రెబెల్‌గా పోటీచేసి పార్టీ నుంచి బహుష్కృతులైనారు. 2010లో మళ్ళీ తెరాసలో చేరి 2014లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయశాంతిపై విజయం సాధించి రెండోసారి శాసనసభలోకి ప్రవేశించారు. జూన్ 12, 2014న తెలంగాణ శాసనసభ డీప్యూటి స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, తెలంగాణ తొలి శాసనసభ సభ్యులు,1969లో జన్మించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక