11, జూన్ 2014, బుధవారం

ఫిఫా (FIFA)

ఫిఫా
ఏర్పాటుమే 21, 1904
ప్రధానకేంద్రంజ్యూరిచ్
ప్రపంచకప్ ఫుట్‌బాల్‌తో సహా పలు సాకర్ టోర్నమెంట్లు నిర్వహించే సమాఖ్య అయిన ఫిఫా పూర్తి రూపం అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ సమాఖ్య. దీనిని మే 21, 1904న పారిస్‌లో స్థాపించబడింది. ఫిఫా తొలి అధ్యక్షుడిగా రాబర్ట్ గెరిన్ వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సమాఖ్యలో 209 దేశాలు కలవు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఉంది. For the Game. For the World దీని యొక్క నినాదం.

చరిత్ర:
ఫుట్‌బాల్ క్రీడకు జనాదరణ పెరిగినందున 20వ శతాబ్ది ప్రారంభంలోనే ఫుట్‌బాల్ నిర్వహణకై ఒక సమాఖ్య అవసరం అనే ఆలోచన వచ్చింది. మే 21, 1904న ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది. "అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ సమాఖ్య" అర్థాన్నిచ్చే ఫ్రెంచి పేరు పొడి అక్షరాలతో ఫిఫాగా నామకరణం చేయబడింది. ఫ్రాన్సు, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్స్ ఈ సమాఖ్య ప్రారంభ దేశాలు. రాబర్ట్ గెరిన్ ఫిఫా తొలి అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టి రెండేళు ఆ పదవి నిర్వహించారు. 1908లో యూరేపేతర దేశాలకు కూడా ఇందులో సభ్యత్వం కల్పించబడింది. 1908లో దక్షిణాఫ్రికా, 1912లో అర్జెంటీనా, చిలీలు, 1913లో కెనడా, అమెరికాలు సభ్యత్వం పొందాయి. ప్రస్తుతం 209 దేశాలు సభ్యత్వాన్ని కలిగియున్నాయి.

6 భాగాలు:
ఫిఫా సభ్యదేశాలైన 209 దేశాలను సమాఖ్య 6 భాగాలుగా విడదీసింది. 1) ఆసియా (ఆస్ట్రేలియాతో సహా), 2) ఆఫ్రికా, 3) ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలు, 4) దక్షిణ అమెరికా, 5) ఓషియానా, 6) యూరప్.

టోర్నీల నిర్వహణ:
ఈ సమాఖ్య ప్రపంచకప్ ఫుట్‌బాల్‌తో సహా పలు ముఖ్య ఫుట్‌బాల్ టోర్నెమెంట్లను నిర్వహిస్తుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని సంక్షిప్తంగా ఫిఫా కప్‌గా కూడా వ్యవహరిస్తారు. టోర్నమెంట్ల నిర్వహణకై బిట్లను స్వీకరించడం, ఓటింగ్ ప్రకారం ఆతిథ్య దేశాలు ప్రకటించడం, అవార్డులు ఇవ్వడం తదితర పనులు కూడా ఈ సమాఖ్య చేపడుతుంది. ఫుట్‌బాల్‌కు సంబంధించి ఈ సమాఖ్య ప్రపంచంలోనే అత్యున్నత సంస్థాగా పరిగణించబడుతుంది.

విభాగాలు: ఫుట్‌బాల్, 1904 స్థాపనలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక