10, జూన్ 2014, మంగళవారం

సిరికొండ మధుసూధనచారి (S.Madhusudhana Chary)

ఎస్.మధుసూధనచారి
జననం13 అక్టోబర్ , 1962
స్వస్థలంనర్సక్కపల్లి (వరంగల్ జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, శాసనసభ స్పీకరు,
సిరికొండ మధుసూధనచారి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 13 అక్టోబర్ 1962న పరకాల వద్ద ఉన్న నర్సక్కపల్లి గ్రామంలో జన్మించిన మధుసూధనచారి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (ఆంగ్లం) పట్టా పొందారు. 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి 1994లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో తెరాస తరఫున విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
మధుసూధనచారి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరి 1994లో శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1996లో తెలుగుదేశం ఫార్టీ సంక్షోభం సమయంలో లక్ష్మీపార్వతి యొక్క ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు చేరారు. తెరాస స్థాపన నుంచే ఆ పార్టీలో ఉంటూ 2001లో తెరాస ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2014 శాసనసభ ఎన్నికలలో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మాజీ ఛీప్ గండ్ర వెంకట రమణారెడ్డిపై విజయం సాధించారు. జూన్ 9, 2014న తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, పరకాల మండలము, శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 10వ శాసనసభ సభ్యులు, తెలంగాణ తొలి శాసనసభ సభ్యులు, 1962లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక