20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ఆంగ్ల నవలా రచయితలలో ప్రముఖుడైన జార్జ్ ఆర్వెల్ జూన్ 25, 1903న అప్పటి బ్రిటీష్ ఇండియాలోని మోతిహరి (ప్రస్తుతం బీహార్‌లో ఉంది) పట్టణంలో జన్మించాడు. ఆయన అసలుపేరు ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ కాగా కలంపేరు జార్జ్ ఆర్వెల్ తోనే ప్రసిద్ధుడైనాడు. బ్రిటన్‌కు చెందిన జార్జ్ ఆర్వెల్ 1984 మరియు ఎనిమల్ ఫాం నవలల ద్వారా విపరీతమైన ప్రచారం పొందాడు. 2008లో టైమ్స్ పత్రిక ఈయనను 1945 తర్వాత ప్రముఖ 50 బ్రిటీష్ రచయితలలో ఒకరిగా ప్రకటించింది. రచయితగా, నవలాకారుడిగా, కాలమిస్టుగా, జర్నలిస్టుగా రాణించిన జార్జ్ ఆర్వెల్ జనవరి 21, 1950న 47 సంవత్సరాల యువ వయస్సులోనే లండన్‌లో మరణించాడు.
బాల్యం: ఈయన తాత, ముత్తాతలు ఎంతో సంపన్నవంతులైననూ ఈయన తరం వచ్చేనాటికి సంపద మిగలలేదు. ఈయన తండ్రి ఇండీయన్ సివిల్ సర్వీసులో పనిచేశారు. బీహార్‌లో ఉన్నప్పుడే మోతిహరి పట్టణంలో ఆర్వెల్ జన్మించాడు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కుటుంబం ఇంగ్లాండుకు వెళ్ళి స్థిరపడింది. నవలలు: ఆర్వెల్ జర్నలిస్టుగా, వ్యాసాలు, సమీక్షల రచయితగా పనిచేసిననూ నవలా రచయితగానే ఎక్కువ ప్రసిద్ధి చెందాడు. నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరియు ఎనిమల్ ఫాం అనే రెండు నవలలు ఈయనకు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. ఇవే కాకుండా బర్మీస్ డేస్, ఎ క్లెర్జీమాన్స్ డాటర్, కమింగ్ అప్ ఫర్ ఎయిర్ కూడా ఈయన రచించిన ప్రసిద్ధి చెందిన నవలలు
= = = = =
|
23, జూన్ 2014, సోమవారం
జార్జ్ ఆర్వెల్ (George Orwell)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి