ఉత్తర భారతదేశములో ప్రవహించే యమునా నది గంగానది యొక్క అతిపెద్ద ఉపనది. 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది హిమాలయ పర్వతశ్రేణులకు చెందిన కాళింది పర్వతంలో యుమునోత్రి అనే స్థలం వద్ద 6387 మీటర్ల ఎత్తున జన్మించి ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ సమీపం నుంచి ప్రవహిస్తూ త్రివేణి సంగమ ప్రాంతమైన అలహాబాదులో గంగానదిలో సంగమిస్తుంది. చంబల్, బెట్వా, కెన్ తదితర ఉపనదులను తనలో కలుపుకుంటున్న ఈ నది పరీవాహక ప్రాంతం 3,66,223 చదరపు కిలోమీటర్లు. ఇది గంగానది పరీవాహ ప్రాంతంలో 40%.ప్రముఖ పర్యాటక స్థలం తాజ్‌మహల్ ఈ నది ఒడ్డునేఉంది. 2014 జూన్‌లో ఈ నదికి పుషరాలు జరుగుతున్నాయి. పురాణాల్లో ప్రస్థావన: భాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాల్యంలో చాలా చోట్ల దీని ప్రస్తావన ఉంది. కృష్ణుని తండ్రియైన వాసుదేవుడు కంసుని బారినుంచి తన కుమారుడిని కాపాడుకోవడానికి ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందని ఉటంకించబడి ఉంది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు. అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు నిర్వహించేవాడని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.
= = = = =
|
23, జూన్ 2014, సోమవారం
యమునానది (Yamuna River)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి