2, జూన్ 2014, సోమవారం

పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy)

పోచారం శ్రీనివాస్ రెడ్డి
జననంఫిబ్రవరి 10, 1950
స్వస్థలంపోచారం (కామారెడ్డి జిల్లా)
పదవులు5 సార్లు ఎమ్మెల్యే, డిసిసిబి చైర్మెన్, తెలంగాణ రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గంబాన్సువాడ అ/ని,
కామారెడ్డి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 10, 1950న బాన్సువాడ మండలం పోచారంలో జన్మించారు. బీటెక్ వరకు అభ్యసించిన పోచారం సహకార సంఘం చైర్మెన్‌గా, డీసిసిబి చైర్మెన్‌గా, 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా తెలంగాణ తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు. శ్రీనివాస్ రెడ్డి అసలు ఇంటిపేరు పరిగె కాగా స్వగ్రామం పోచారం ఇంటిపేరుగా మారింది.

రాజకీయ ప్రస్థానం:
1977లో దేశాయిపేట సహకార సంఘం చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాదు జిల్లా డిసిసిబి చైర్మెన్ అయ్యారు. 1994లో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1999లో కూడా అదేస్థానం నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగానూ పనిచేశారు. స్టేషనరి కుంభకోణంలో నైతిక బాధ్యత వహిస్తూ 2002లో రాజీనామా చేశారు. 2004 ఎన్నికలలో పరాజయం పొందారు. 2009లో మళ్ళీ తెదేపా తరఫున విజయం సాధించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2011 ఉప ఎన్నికలలో తెరాస తరఫున గెలుపొందినారు. 2014లో కూడా బాన్సువాడ నుంచి ఐదవసారి విజయం సాధించి కె.చంద్రశేఖర్ రావు మంత్రిమండలిలో స్థానం పొందారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, బాన్సువాడ మండలం, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ తొలి శాసనసభ సభ్యులు, తెలంగాణ తొలి శాసనసభ మంత్రులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక