3, జూన్ 2014, మంగళవారం

తన్నీరు హరీష్ రావు (Tannir Harish Rao)

తన్నీరు హరీష్ రావు
జననంజూన్ 3, 1972
స్వస్థలంతోటపల్లి (కరీంనగర్)
పదవులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంసిద్ధిపేట అ/ని,
తన్నీరు హరీష్ రావు కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. జూన్ 3, 1972న కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో జన్మించిన హరీష్ రావు బీఏ వరకు అభ్యసించారు. 2004లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఇప్పటివరకు అదే స్థానం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
హరీష్ రావు 2004లో తొలిసారి సిద్ధిపేట నుంచి తెరాస తరఫున ఎన్నికయ్యారు. వైఎస్సార్ మంత్రివర్గంలో కొంతకాలం పనిచేసి రాజీనామా చేశారు. 2008లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్ళీ పోటీచేసి రెండవ సారి విజయం సాధించారు. 2009 సాధారణ ఎన్నికలలో మూడవసారి ఎన్నికై హాట్రిక్ సాధించారు. 2010లో మళ్ళీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో ఎన్నికైనారు. 2014లో ఇదే స్థానం నుంచి ఐదవ పర్యాయం ఎమ్మెల్యే అయ్యారు. 2014 జూన్‌లో తెలంగాణ తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, బెజ్జంకి మండలము, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ మంత్రులు, 13వ శాసనసభ సభ్యులు, తెలంగాన తొలి శాసనసభ సభ్యులు, తెలంగాణ తొలి శాసనసభ మంత్రులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక