బాన్స్‌వాడ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్రముఖ శిల్పి మరియు చిత్రకారుడు శ్రీహరి భోలేకర్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు. మండలం నైరుతి సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున గాంధారి మండలం, దక్షిణాన నిజాంసాగర్ మండలం, నైరుతిన పిట్లం మండలం, వాయువ్యాన బిర్కూరు మండలం, ఉత్తరాన నస్రుల్లాబాదు మండలం, ఈశాన్యంలో నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68662. ఇందులో పురుషులు 33003, మహిళలు 35659. పట్టణ జనాభా 28341, గ్రామీణ జనాభా 40321. రాజకీయాలు: ఈ మండలము బాన్స్‌వాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Banswada (CT), Borlam, Budmi, Chinna Nagaram, Chinna Rampur, Chintal Nagaram, Desaipet ,Hanmajipet, Ibrahimpet, Khadlapur, Kollur, Konapur, Pocharam, Sangojipet, Singaraipalle, Someshwar, Tadkole, Tirmalapur, Vasudevpalle
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బాన్స్‌వాడ (Banswada):బాన్స్‌వాడ కామారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము, పురపాలక సంఘం. మండల వ్యవస్థకు పూర్వం ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. బొల్లక్‌పల్లి (Bollakpally): బొల్లక్‌పల్లి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ మంజీరానది అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. బొల్లక్‌పల్లి శివారులో మంజీరానది దక్షిణ నుంచి ఉత్తర దిశకు ప్రవహించే ప్రాంతం అయినందున "గరుడ గంగ"గా పిలుస్తూ ఇక్కడ మంజీర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రముఖ శిల్పి మరియు చిత్రకారుడు శ్రీహరి భోలేకర్ ఈ గ్రామానికి చెందినవారు. బొర్లాం (Borlam): బొర్లాం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఆదిబసవేశ్వరాలయం ఉంది. పోచారం (Pocharam): పోచారం కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ మండలమునకు చెందిన గ్రామము. బాన్స్‌వాడ అసెంబ్లీ నుంచి 5 సార్లు ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం. 2014, జూన్ 2న పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిపదవి లభించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Banswada Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి