27, జూన్ 2014, శుక్రవారం

సాం మానెక్‌షా (Sam Manekshaw)

మానెక్‌షా
జననంఏప్రిల్‌ 3, 1914
జన్మస్థానంఅమృతసర్
అత్యున్నత పదవిఫీల్డ్ మార్షల్
మరణంజూన్ 27, 2008
భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా ఏప్రిల్‌ 3, 1914న పంజాబ్‌లోని అమృతసర్‌లో జన్మించారు. దేశానికి సాహసోపేత సైనిక విజయాలు అందించిన మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా. 1971లో పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్‌కు దిగ్విజయ సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకులైన వారిలో ఒకరిగా నిలిచారు. ఈయన మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు. జూన్ 27, 2008న మానెక్‌షా మరణించారు.

వృత్తిజీవనం:
అమృతసర్‌, నైనిటాల్‌లలో పాఠశాల విద్య అభ్యసించిన మానెక్‌షా, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో క్యాడెట్‌గా శిక్షణ పొందారు. 1934 లో సైన్యంలో రెండో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి,  1935లో లెఫ్టినెంట్‌గా, 1940లో కెప్టెన్‌గా, 1943లో మేజర్‌గా, 1947లో బ్రిగేడర్‌గా, 1957లో మేజర్ జనరల్‌గా, 1962లో లెఫ్టినెంట్ జనరల్‌గా, జూన్ 7,1969న జనరల్ కుమారమంగళం నుండి 8వ సైనిక దళాల ప్రదానాదికారిగా బాధ్యతలు స్వీకరించి 1973లో ఫీల్డ్‌మార్షల్‌గా పదవి పొంది మరణించేవరకు ఆ పదవిలో కొనసాగారు.

బ్రిటిష్‌ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన మానెక్‌షా రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్‌ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్‌'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్‌షా అమరుడు కావచ్చునని భావించిన నాటి మేజర్‌ జనరల్‌ డి.టి.కోవన్‌, తన 'మిలిటరీ క్రాస్‌ రిబ్బన్‌'ను తక్షణం మానెక్‌షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్‌షా, మరోసారి బర్మాలో జపాన్‌ సైనికులను ఢీకొన్నారు. మళ్ళీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. 1947లో దేశవిభజన, 1947-48లో జమ్మూకాశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్‌ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 45,000 మంది పాక్‌సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయన కీలకపాత్ర వహించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది.

పురస్కారాలు:
రెండోప్రపంచ యుద్ధకాలంలోనే మిలటరీక్రాస్ పొందిన మానెక్‌షా స్వాతంత్ర్యానంతరం భారతప్రభుత్వం నుంచి 1968లో పద్మభూషన్ అవార్డును, 1973లో పద్మవిభూషణ అవార్డును స్వీకరించారు.


హోం,
విభాగాలు: 1914లో జన్మించినవారు, 2008లో మరణించినవారు, ఫీల్డ్ మార్షల్‌లు, పంజాబ్ ప్రముఖులు, పద్మవిభూషణ్ గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక