నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకురాలు. తమిళనాడులోని మధురైలో ఆగస్టు 18, 1959 న జన్మించిన నిర్మల మే 2014లో నరేంద్రమోడి మంత్రివర్గంలో స్థానం పొందారు. జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందినారు. 2003-05 కాలంలో జాతీయ మహిళా కమీషన్ సభ్యులుగా పనిచేశారు. భర్త పరకాల ప్రభాకర్ కూడా రాజకీయ నాయకుడిగా ఉన్నారు. నిర్మల తమిళనాడులో జన్మించినా తెలుగువారి కోడలుగానే రాజకీయాలలో రాణించి రాజ్యసభ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం: నిర్మల 2006లో భారతీయ జనతాపార్టీలో ప్రవేశించారు. చాలా కాలంపాటు పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. నరేంద్రమోడికి మద్దతుగా మీడియాను కూడగట్టడంలో వ్యూహాత్మక పాత్రను పోషించారు. ఆమెకు గల వాగ్ధాటి సామర్థ్యాలు నరేంద్ర మోడిని ఆకట్టుకున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా భాజపా వ్యాఖ్యాతగా చేసిన కృషికిగాను2014లో ఆమెను తన కేబినెట్‌లోకి తీసుకొన్నారు. జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అత్తామామలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనా ఈమె భాజపాలో ఉంటూ రాణించారు. 2017లో రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ పదవి పొందిన రెండో మహిళగా కీర్తిగడించారు. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడిన నరేంద్రమోడి రెండో కేబినెట్‌లో నిర్మల ఆర్థికశాఖ మంత్రిగా నియమితులైనారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా, పూర్తిస్థాయి ఆర్థికశాఖ చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, జూన్ 2014, శుక్రవారం
నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి