14, జులై 2014, సోమవారం

ఫీఫా ప్రపంచ కప్ 2014 (FIFA World Cup 2014)


ఫీఫా ప్రపంచ కప్ 2014
విజేతజర్మనీ
రెండోస్థానంఅర్జెంటీనా
ఆతిథ్యదేశంబ్రెజిల్
టోర్నీ కాలంజూన్-జూలై 2014
ఫీఫా ప్రపంచ కప్ 2014 టోర్నమెంటు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో జూన్ 12, 2014న ప్రారంభమైంది. 32 జట్లు హోరాహోరీగా తలపడిన ఈ టోర్నమెంటులో జూలై 13, 2014న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు అదనపు సమయంలో గోల్ చేసి 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించి 4వ సారి ఫీఫా కప్ సాధించింది. ఫేవరైట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్యజట్టు బ్రెజిల్ 4వ స్థానంలో నిలిచింది. 3,4 స్థానాలకోసం జరిగిన పోటీలో నెదర్లాండ్స్ జట్టు బ్రెజిల్‌పై గెలుపొందింది.

గ్రూప్ మ్యాచ్‌లు:
టోర్నమెంటులో పాల్గొన్న 32 జట్లు 8 గ్రూపు మ్యాచ్‌లలో తలపడి ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు ప్రీక్వార్ట్స్ లోకి ప్రవేశించాయి. బ్రెజిల్ "ఏ" గూపులో, నెదర్లాండ్స్ "బి" గ్రూపులో, అర్జెంటీనా "ఎఫ్" గ్రూపులో, జర్మనీ "జి" గ్రూపులో అగ్రస్థానం పొందాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. క్వార్టర్ ఫైనల్స్ చేరిన 8 జట్లు అన్నీ దక్షిణ/లాటిన్ అమెరికా, యూరప్ ఖండాలకు చెందినవే.

అవార్డులు:
 • ఈ టోర్నీలో గోల్డెన్ బాల్ అవార్డు అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీకి లభించగా, సిల్వర్ బాల్ జర్మనీకి చెందిన థామస్ ముల్లర్‌కు లభించింది. 
 • గోల్డెన్ బూట్ అవార్డు కొలంబియాకు చెందిన జేమ్స్ రోడ్రిగ్జ్‌కు, సిల్వర్ బూట్ అవార్డు జర్మనీకి చెందిన థామస్ ముల్లర్‌కు లభించింది.
 • ఉత్తమ గోల్‌కీపర్‌కు ప్రధానం చేసే గోల్డెన్ గ్రోవ్ అవార్డు జర్మనీకి చెందిన మాన్యువెల్ న్యూర్‌కు లభించింది.

రికార్డులు:
 • జర్మనీకి చెందిన మిరొస్లావ్ కోల్జ్ 16వ గోల్ కొట్టి ప్రపంచకప్ రొనాల్డోను వెనక్కి నెట్టి చరిత్రలోనే అత్యధిక గోల్స్ నమోదుచేసిన క్రీడాకారుడిగా అవతరించాడు.
 • జర్మనీ జట్టు ఫీఫా కప్ గెలవడం ఇది 4వ సారి. గతంలో 1954, 1974, 1990లలో కప్ గెలిచింది.

విభాగాలు: ఫుట్‌బాల్, ప్రపంచ కప్ టోర్నెమెంట్లు, 2014,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక