30, జులై 2014, బుధవారం

అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah)

 అల్లు రామలింగయ్య
జననంఅక్టోబర్ 1, 1922
స్వస్థలంపాలకొల్లు
రంగంసినిమా నటుడు
మరణంజూలై 31, 2004
తెలుగు సినిమా హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు. చిన్న వయస్సులోనే అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం ద్వారా నాటకాలలో నటించే అవకాశం లభించింది. నాటకాల్లో నటిస్తూనే, గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవారు. నాటకాల అనుభవంతో సినిమాలో ప్రవేశించి వెయ్యికిపైగా సినిమాలలో నటించారు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య తదితర అవార్డులు స్వీకరించారు. అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట మరణించారు.

సినీప్రస్థానం:
అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు' లో నటించారు. ఆ తర్వాత మద్రాసుకు మకాం మార్చారు. ప్రారంభంలో అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. 1000కిపైగా సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించారు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసారు.

గుర్తింపులు:
50 సంవత్సరాల పాటు సినిమాల్లో కొనసాగిన అల్లుకు పలు సన్మానాలు, గౌరవాలు, అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం 1990 లో 'పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది. 2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

బంధుత్వం:
అల్లురామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ కూడా నటుడిగా రాణించారు. అల్లుడు చిరంజీవి ప్రముఖ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించడమే కాకుండా కేంద్రమంత్రిగానూ పనిచేశారు. మనవడు అల్లు అర్జున్ కూడా సినిమాలలో రాణిస్తున్నారు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలుగు సినిమా నటులు, పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు, 1992లో జన్మించినవారు, 2004లో మరణించినవారు, పద్మశ్రీ గ్రహీతలు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక