29, జులై 2014, మంగళవారం

సి.నారాయణరెడ్డి (C.Narayana Reddy)

సి.నారాయణరెడ్డి
జననంజూలై 29, 1931
స్వస్థలంహనుమాజీపేట (కరీంనగర్ జిల్లా)
రంగంసాహితీవేత్త
అవార్డులుజ్ఞాన్‌పీఠ్ అవార్డు (1988)
సినారె గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధునిక సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931,జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు.ఆధునిక తెలుగు సాహితీవేత్తలలో అగ్రగణ్యుడైన సినారె 1988లో జ్ఞాన్‌పీఠ్ అవార్డును పొందడమే కాకుండా పలు ఉన్నత పదవులు నిర్వహించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, పలు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా పనిచేశారు. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలుగు సినిమాకు సంబంధించి 3500పైగా పాటలు రచించారు.

బాల్యం, విద్యాభ్యాసం:
సి.నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జూలై 29, 1931న జన్మించారు. ప్రాథమిక విద్య స్థానికంగా గ్రామంలో అభ్యసించారు. బాల్యంలో హరికథలు, జానపదాలు,జంగం కథల వైపు ఆకర్షితుడయ్యారు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు.

ఉద్యోగం, సాహితీ ప్రస్థానం:
నారాయణరెడ్డి ఆరంభంలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు. "విశ్వంభర" కావ్యానికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం పొంది విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడిగా నిలిచారు. అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక సినారె తొలి ప్రచురణ. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500పైగా సినీగీతాలు రచించారు.

పదవులు:
సినారె పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981), అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989), ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992), రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత రాష్ట్రపతిచే 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.

విభాగాలు: తెలుగు సాహితీవేత్తలు, కరీంనగర్ జిల్లా ప్రముఖులు, రాజ్యసభ సభ్యులు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలు, తెలుగు సినిమా పాటల అరచయితలు, 1931లో జన్మించినవారు, తెలంగాణ ప్రముఖులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక