18, ఆగస్టు 2014, సోమవారం

పాలమూరు విశ్వవిద్యాలయము (Palamuru University)

 పాలమూరు విశ్వవిద్యాలయము
పట్టణంమహబూబ్ నగర్
స్థాపన2008
పాలమూరు విశ్వవిద్యాలయంను మహబూబ్ నగర్ పట్టణంలోని బండమీదిపల్లి ప్రాంతములో 2008 లో ఏర్పాటుచేయబడినది. అంతకు ముందు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా పిజి సెంటరుగా ఉండేది. 2008-09 విద్యా సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ఎం.ఎ.(రాజనీతి శాస్త్రం), ఎం.బి.ఏ., ఎం.సీ.ఏ., ఎం.కాం., ఎమ్మెస్సీ కోర్సులు ప్రారంభించారు. 2009లో బీఫార్మసీ, 2010లో ఎంసీడబ్ల్యూ తదితర కోర్సులు కూడా ప్రారంభించడంతో ప్రస్తుతం మొత్తం 14 కోర్సులు కలిపి 1800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని డిగ్రీకళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి.

ప్రత్యేకతలు:
  • 12 నవంబర్,2010న పాలమూరు విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్.(జాతీయ సేవా పథకం)విభాగం ఆధ్వర్యంలో 2,500 మందితో 'లార్జెస్ట్ బేర్‌ఫుట్‌ వాక్'అనే కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయంగా పాలమూరు విశ్వవిద్యాలయం రికార్డు సృష్టించింది. జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఈ రికార్డుకు వ్యూహ రచన చేసి విశ్వ విద్యాలయ ఉపకులపతి, రెజిస్ట్రార్,ఎన్.ఎస్.ఎస్.జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు,ప్రోగ్రాం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థుల సహకారంతో ఈ రికార్డు సృష్టించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయానికి 'మహా మహా' అనే బిరుదునిచ్చి గౌరవించారు.
  • పాలమూరు విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి 5633 అక్షరాలతో హ్యాండీక్రిస్టల్స్... ప్రారంభ పదాలుగా అతిపొడవైన గ్రంథ శీర్షిక పెట్టినందుకు గిన్నిస్ రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా గుర్తించారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ పట్టణం, తెలంగాణ విశ్వవిద్యాలయాలు, 2008 స్థాపితాలు,

 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక