4, సెప్టెంబర్ 2014, గురువారం

మల్లిపూడి శ్రీరామ సంజీవరావు (Mallipudi Srirama Sanjeeva Rao)


మల్లిపూడి శ్రీరామ సంజీవరావు
జననంఆగస్టు 3, 1929
స్వస్థలంబాలాంతరం
పదవులుకేంద్రమంత్రి (1982-84)
మరణంసెప్టెంబరు 3, 2014
కేంద్రమంత్రిగా పనిచేసిన మల్లిపూడి శ్రీరామ సంజీవరావు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఆగస్టు 3, 1929న జన్మించారు. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా బాలాంతరం గ్రామం. ఈయన 3 సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ఇందిర హయంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఈయన తండ్రి రాష్ట్రమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేయగా, కుమారుడు 2 సార్లు కేంద్రమంత్రిగా వ్యవహరించారు. సంజీవరాజు సెప్టెంబరు 3, 2014న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
లండన్‌లో ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసిన సంజీవరావు 1970లో రాజకీయాలలో ప్రవేశించి అదే ఏడాది రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1971లో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపి అయ్యారు. 1977 మరియు 1980లలో కూడా వర్స విజయాలు సాధించారు. 1982-84 కాలంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా పదవి నిర్వహించారు.

రాజకీయ వారసత్వం:
సంజీవరావు తండ్రి మల్లిపూడి పళ్లంరాజు కూడా రాజకీయ నేతగా ప్రసిద్ధిచెందారు. ఈయన జవహార్‌లాల్ నెహ్రూకి సన్నిహితుడు. రాష్ట్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. సంజీవరావు కుమారుడు ఎం.ఎం.పళ్లంరాజు 3 సార్లు ఎంపీగా, 2 సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు.

విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, 1929లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, కాకినాడ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక