13, సెప్టెంబర్ 2014, శనివారం

మణిపూర్ (Manipur)

మణిపూర్
అవతరణజనవరి 21, 1972
రాజధానిఇంఫాల్
విస్తీర్ణం 22,327 చకిమీ
జనాభా 27,21,756 (2011)
మణిపూర్ ఈశాన్య భారతదేశంలో ఉన్న ఏడు రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్ర రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరామ్, పశ్చిమాన అసోం రాష్ట్రాలున్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. మణిపూర్‌లో మీటి తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. రాష్ట్ర అధికార భాష మీటి (మణిపురి) భాష. ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ సరస్సు లోక్‌తక్ సరస్సు, కాంగ్లా ప్యాలెస్ ఈ రాష్ట్రంలోనివే. ప్రముఖ క్రీడాకారిణులు మేరీకోం, కుంజారాణిదేవిలు మణిపూర్‌కు చెందినవారు. రాష్ట్రంలో 9 జిల్లాలు, 2 లోకసభ నియోజకవర్గాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
మణిపూర్ 23°83’ నుంచి 25°68’ ఉత్తర అక్షాంశం, 93°03’ నుంచి 94°78’ తూర్పు రేఖాంశంపై ఉంది. మణిపూర్‌కు ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరం, పశ్చిమాన అస్సాం రాష్ట్రాలు ఉండగా తూర్పున మయన్మార్ (బర్మా) దేశం సరిహద్దుగా ఉంది. రాష్ట్ర వైశాల్యం 22,327 చదరపు కిలోమీటర్లు. బరక్ నది మరియు మణిపూర్ నది ఈ రాష్ట్రం గుండా ప్రవహించే ముఖ్యమైన నదులు. బరక్ నది ఈ రాష్ట్రంలోనే జన్మించి అస్సాంలోకి ప్రవేశిస్తుంది. 

మణిపూర్‌కు చెందిన ప్రముఖ
మహిళా బాక్సర్ మేరీకోం
చరిత్ర:
మణిపూర్ ప్రాచీన చరిత్రను కలిగియుంది. నింగ్‌థౌ వంశానికి చెందిన సుమారు 125 రాజులు మణిపూర్‌ను 1900 సంవత్సరాలకు పైగా పాలించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో మణిపూర్ సంస్థానంగా బ్రిటీష్ వారి అధినంలోకి వెళ్ళింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలకూ మిత్రదేశాల సేనలకు (Allied forces) మధ్య జరిగిన యద్ధాలకు మణిపూర్ యుద్ధరంగమైంది. 1947లో భారత స్వాతంత్ర్య ప్రక్రియలో మళ్ళీ మణిపూర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపూర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపూర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యపాలనకు నాంది పలికాడు. 1949లో భారతదేశంలో విలీనం చేశాడు. 1956 నుండి మణిపూర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబడింది. 1972లో మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

పర్యాటకం:
ఈశాన్య భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన లోక్‌తక్ సరస్సు, మణిపూర్ పాలకుల రాజభవనం కాంగ్లా ప్యాలెస్, లోక్‌తక్ జలవిద్యుత్ కేంద్రం తదితరాలు ఈ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కాకుండా సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవైన కొండలు, ప్రకృతి సంపద ఈ రాష్ట్రంలో అపారంగా ఉంది.

విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, మణిపూర్,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక