6, అక్టోబర్ 2020, మంగళవారం

మిజోరం (Mizoram)

రాజధాని
ఐజ్వాల్
అవతరణ
1987
జిల్లాలు
11
వైశాల్యం
21,087 చకిమీ
జనాభా
10.91 లక్షలు
శాసనసభ స్థానాలు
40
మిజోరం భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. 1987లో రాష్ట్రంగా అవతరించిన మిజోరాం రాజధాని ఐజ్వాల్. త్రిపుర, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలను బంగ్లాదేశ్ మరియు మయన్మార్ దేశాలను సరిహద్దుగా కల్గియుంది. మిజోరం రాష్ట్ర జనాభా 10.91 లక్షలు (2011 ప్రకారం)., రాష్ట్ర వైశాల్యం 21,087 చకిమీ. మిజోరంలో 11 జిల్లాలు, 40 శాసనసభ స్థానాలు, ఒక్కో లోక్‌సభ, రాజ్యసభ స్థానాలు కలవు. మిజోరం సాంప్రదాయ నృత్యాలు చప్చర్ కుట్,  మిజోరం రాష్ట్ర ప్రధాన క్రీడ ఫుట్‌బాల్. యూత్ ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జెర్మీ లాల్‌రినుంగా ఈ రాష్ట్రానికి చెందినవాడు.

భౌగోళికం;
ఈశాన్య రాష్ట్రాలలో అతి దక్షిణాన త్రిపుర, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలను బంగ్లాదేశ్ మరియు మయన్మార్ దేశాలను సరిహద్దుగా కల్గియుంది. కర్కటరేఖ రాష్ట్రం మధ్యగా వెళ్ళుచున్నది. ఇది దేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రెండో రాష్ట్రం మరియు వైశాల్యంలో ఐదో చిన్న రాష్ట్రం. రాష్ట్ర వైశాల్యంలో సుమారు 90% అడవులున్నాయి. రాష్ట్రంలో పెద్ద పట్టణాలు ఐజ్వాల్, లుంగ్లీ, చంపాయ్, లాంగ్‌ట్లాయ్, మామిట్. జనాభాలో 70%పైగా మిజో తెగ ప్రజలున్నారు.

చరిత్ర:
బ్రిటీష్ పాలనకు ముందు స్థానిక మిజో తెగ వారే ఇక్కడ ఆధిపత్యం చెలాయించారు. 1840 దశకంలో బ్రిటీష్ వారు బలవంతంగా ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్ర్యానంతరం అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1972లో అస్సాం నుంచి విడదీసి ముందు కేంద్రపాలిత ప్రాంతంగా, 1987లో 23వ రాష్ట్రంగా అవతరించింది.

రవాణా సౌకర్యాలు:
జాతీయ రహదారులు 54 మరియు 150 ద్వారా అస్సాం మరియు మణిపూర్‌లతో రవాణా సంబంధాలు ఉన్నాయి. ఐజ్వాల్ సమీపంలో లెంగ్‌పూ విమానాశ్రయం ఉంది.

ఆర్థికం:
మిజోరాంలో విస్థాపన (ఝమ్‌) పద్దతిలో వ్యవసాయం చేస్తారు. రాష్ట్రంలో 90% అరణ్యాలు కావడం కొండప్రాంతాలు అధికంగా ఉండుటచే వ్యవసాయ యోగ్యమైన భూమి కొరతగా ఉంది. అటవీ ఉత్పత్తులు ముఖ్యంగా వెదురు ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, మిజోరాం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక