21, అక్టోబర్ 2014, మంగళవారం

అఘోరనాథ్ చటోపాధ్యాయ (Aghore Nath Chattopadhyay)

అఘోరనాథ్ చటోపాధ్యాయ


అఘోరనాథ్ చటోపాధ్యాయ ఇప్పటి బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపురలో జన్మించారు. 1877లో ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఈయన నైపుణ్యాన్ని గురించి విన్న నిజాం నవాబు హైదరాబాదుకు రప్పించి తన సంస్థానంలో విద్యాభివృద్ధికై అఘోరనాథ్ సేవలను వాడుకున్నారు. ఈయన స్థాపించిన ఆంగ పాఠశాల క్రమంగా నిజాంకాలేజిగా మారింది. ఈ కళాశాలకు ఈయనే తొలి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. తన భార్యతో కలిసి నాంపల్లిలో బాలికా పాఠశాలను కూడా నెలకొల్పారు. ఇదే తర్వాతి కాలంలో ఉస్మానియా మహిళా కళాశాలగా మారింది. 1885లో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటి తొలిసమావేశంలో హైదరాబాదు నుంచి పాల్గొన్న అతికొద్ది వారిలో ఈయన ఒక్కరు. ఇంగ్లాండు నుంచి రుణాలు పొందాలనే పథకానికి ఈయన వ్యతిరేకించడంతో బ్రిటీష్ ప్రభుత్వం రాష్ట్ర బహిష్కరణ చేయడంతో ఆరేళ్ళు కలకత్తాలో ప్రవాసజీవనం గడిపారు.

కుటుంబం:
ఈయన కూతురు సరోజినీనాయుడు కవియిత్రి, సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు. గవర్నరుగానూ పనిచేశారు. కుమారుడు హరీంద్రనాథ్ రాజకీయ నాయకుడు, మరో కుమారుడు వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.

విభాగాలు: విద్యావేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక