19వ శతాబ్దపు ప్రముఖ భారతీయ సంఘసంస్కర్తలలో ఒకరైన దయానంద సరస్వతి ఫిబ్రవరి 12, 1824న గుజరాత్‌లోని టంకర గ్రామంలో జన్మించారు. ఈయన అసలుపేరు మూలశంకర్. వేద సంప్రదాయంలో హిందూసంస్కృతిని పరిరక్షించడంలో కృషిచేయడమే కాకుండా 1975లో అర్యసమాజ్ అనే సంస్థను స్థాపించి ప్రసిద్ధి చెందినాడు. ఈయన గురువు విరజానందస్వామి. భారతదేశం భారతీయులకే అనే స్వరాజ్ నినాదాన్ని మొదటిసారిగా ప్రవచించినది ఈయనే.
ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథురలోని స్వామి విరజానంద సరస్వతి వద్దకు చేరుకున్నాడు. అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరాడు. ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన భారతదేశం ఆ స్మయంలో అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. మేడంకామా, గురుదత్ విద్యార్థి, వినాయక్ దామోదర్ సావర్కార్, లాలా హర్‌దయాళ్, మదన్‌లాల్ ధింగ్రా, రాంప్రసాద్ బిస్మల్, మాహాదేవ గోవిందరనడే, స్వామి శ్రద్ధానంద, మహాత్మా హంసరాజ్, లాలా లజపతిరాయ్ తదితరులు ఈయనచే ప్రభావితులైనవారు. ఈయన రచించిన సత్యార్థ ప్రకాష్ గ్రంథం సుప్రసిద్ధమైనది. మతమార్పిడిలు చేసిన వారిని తిరిగి హిందూమతంలోకి రప్పించడానికి శుద్ధిఉద్యమాన్ని ప్రారంభించారు. 30 అక్టోబరు, 1883న దయానంద సరస్వతి మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
18, అక్టోబర్ 2014, శనివారం
దయానంద సరస్వతి (Dayananda Saraswati)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి