14, అక్టోబర్ 2014, మంగళవారం

దుద్దిల్ల శ్రీపాదరావు (Duddilla Sripada Rao)

దుద్దిల్ల శ్రీపాదరావు
జననంమార్చి 2, 1935
స్వస్థలంధనవాడ (కాటారం మండలం)
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్
మరణంఏప్రిల్ 13, 1999
దుద్దిల్ల శ్రీపాదరావు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు. ఈయన మార్చి 2, 1935న కరీంనగర్ జిల్లా ధనవాడ గ్రామంలో జన్మించారు. న్యాయవిద్య అభ్యసించిన శ్రీపాదరావు ప్రారంభంలో పంచాయతి కార్యాలయంలో క్రిందిస్థాయి ఉద్యోగిగా జీవనం ఆరంభించి, రాజకీయాలలో ప్రవేశించి సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, భూ తనఖా బ్యాంకు చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, శాసనసభ స్పీకరుగా అంచెలంచెలుగా ఎదిగారు. ఏప్రిల్ 13, 1999న నక్సలైట్ల కాల్పులలో శ్రీపాదరావు మరణించారు. ఈయన కుమారుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా రాజకీయ నాయకుడిగా రాణించి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు.

బాల్యం, విద్యాభ్యాసం:
దుద్దిల్ల శ్రీపాదరావు కాటారం మండలం ధనవాడ గ్రామంలో మార్చి 2, 1935న జన్మించి 3వ తరగతి వరకు స్థానికంగా ధనవడాలోనే అభ్యసించారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు మంథనిలో, ఇంటర్మీడియట్ నుంచి న్యాయవిద్య వరకు హైదరాబాదులో పూర్తిచేశారు. శ్రీపాదరావు చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి వెంబడి విమోచనోద్యమంలో పాల్గొన్నారు. శ్రీపాదరావు పూర్వీకులు ఆదిలాబాదు జిల్లా చెన్నూరుకు చెందిన వైదిక బ్రాహ్మణులు. ప్రారంభంలో శ్రీపాదరావు పంచాయతి కార్యాలయంలో కారోబార్ గా, LI C ఏజెంటుగా పనిని చేపట్టి ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్ పదవి చేపట్టారు.

రాజకీయ ప్రస్థానం:
శ్రీపాదరావు 1964-83 వరకు స్వగ్రామం ధనవాడ గ్రామపంచాయతి సర్పంచిగా వరసగా 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈయన హయంలోనే 2 సార్లు ఈ గ్రామం ఉత్తమ పంచాయతి అవార్డు పొందినది. ఆ కాలంలోనే మంథని, మహాదేవ్‌పూర్ భూ తనఖా బ్యాంకుల చైర్మెన్‌గా 3 సార్లు పనిచేశారు. 1980లో సర్పంచిగా ఉన్నప్పుడే మహాదేవ్‌పూర్ సమితి అధ్యక్షుడిగానూ ఎన్నికైనారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ కొరకు ప్రయత్నించి విఫలమైననూ 1983, 1985, 1989లలో వరసగా 3 సార్లు మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1984లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విప్‌గా ఎన్నికై 1989 వరకు కొనసాగినారు. 1994లో పరాజయం పొందినారు. 1995లో నక్సలైట్లు ధనవాడలో ఆయన స్వంత ఇంటిని పేల్చివేయగా, 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు నక్సలైట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయనాయకులు, కాటారం మండలం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు, మంథని అసెంబ్లీ నియోజకవర్గం, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 1935లో జన్మించినవారు, 1999లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక