ఆదిలాబాదు జిల్లా తెలంగాణలో అతిఉత్తరాన ఉన్న జిల్లా. జిల్లాలో 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం కుంటాల జలపాతం ఈ జిల్లాలోనిది. కేంద్రమంత్రిగా పనిచేసిన సముద్రాల వేణుగోపాలచారి, సాహితీవేత్త సామల సదాశివ, ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు.
భౌగోళిక స్వరూపం: ఆదిలాబాదు జిల్లాకు తూర్పున కొమురంభీ జిల్లా, దక్షిణాన నిర్మల్ జిల్లా, పశ్చిమాన మరియు ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నాయి. కడెంనది జిల్లా మధ్య నుంచి ప్రవహిస్తుంది. రాష్ట్రంలో ఎత్తయిన కుంతల జలపాతం, పొచ్చెర జలపాతం, సహ్యాద్రి కొండలు లాంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇది ఎంతో ఘనచరిత్రను కలిగియున్న ప్రాంతం. రామాయణకాలం నాటి చారిత్రక ఆధారాలు జిల్లాలోని పలు ప్రాంతాలాలలో లభ్యమైనాయి. మౌర్యులు, శాతవాహనులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని మొగలాయి పాలనా కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన బీజపూరు సుల్తాను మహమ్మద్ అదిల్ షా పేరు మీద ఆదిలాబాదుగా మార్చబడింది. 2016 అక్టోబరు 11కు ముందు ఈ జిల్లా 52 మండలాలలో ఉండగా జిల్లాల పునర్విభజన ఫలితంగా జిల్లా 4 ముక్కలైంది. నిర్మల్, కొమురంభీం, మంచిర్యాలలు ప్రత్యేక జిల్లాలుగా అవతరించాయి. రవాణా వ్యవస్థ: ఆదిలాబాదు జిల్లాలో నాందేడ్ - ఆదిలాబాదు మార్గం పశ్చిమాన జిల్లాలో ప్రవేశించి ఆదిలాబాదు వరకు ఉంది. జిల్లా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు జిల్లా మీదుగా వెళుతుంది. పర్యాటక ప్రాంతాలు:
జనాభా: 2001 లెక్కల ప్రకారం ఆదిలాబాదు జిల్లా జనాభా 24,79,347. ఇది రాష్ట్ర జనాభాలో 3.13%. జిల్లా జనాభాలో గ్రామీణ జనాభా 18,23,004 (73.52%), పట్టణ జనాభా 6,56,343 (26.48%). జనసాంద్రత 129. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 2737738. ఇందులో పురుషులు 1366964, మహిళలు 1370774. (జనాభా సమాచారం జిల్లాల పునర్విభజనకు పూర్వ సమాచారం) ఖనిజాలు: పరిశ్రమలు: ఆదిలాబాదు సమీపంలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
25, నవంబర్ 2013, సోమవారం
ఆదిలాబాదు జిల్లా (Adilabad Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి