కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మానేరు నది, మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాదరావు, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహాదేవ్‌పూర్ మండలం, తూర్పున ముత్తారం మహాదేవ్‌పూర్ మండలం, దక్షిణాన భూపాలపల్లి మండలం, నైరుతిన మల్హర్రావు మండలం, పశ్చిమాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 37333. ఇందులో పురుషులు 18579, మహిళలు 18754.
రాజకీయాలు:
ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.సమ్మయ్య ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన జక్కు శ్రీహర్షిణి విజయం సాధించారు.
కాటారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adivarampeta, Bayyaram, Bopparam, Chidnepalli, Chinthakani, Damerakunta, Devarampalli, Dhanwada, Dharmasagar, Garepalli, Gudoor, Gummallapalli, Gundrathpalli, Jadaraopet, Kambalpad, Kataram, Kothapalli, Mallaram, Medipalli, Morepalli, Nallagunta, Nasthurpalli, Odipilavancha, Pochampalli, Pothulvai, Prathapagiri, Raghupalli, Regulagudem, Sundarajpeta, Veerapoor, Vilasagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ధన్వాడ (Dhanwada): ధన్వాడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలమునకు చెందిన గ్రామము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ళ శ్రీపాదరావు, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ గ్రామమునకు చెందినవారు. గంగారం (Gangaram):
గంగారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామపంచాయతి 2018 సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారం పొందింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Kataram Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి