27, నవంబర్ 2014, గురువారం

బి.సుమిత్రాదేవి (B.Sumitra Devi)

బత్తుల సుమిత్రాదేవి
జననంఅక్టోబరు 8, 1918
రంగంస్వాతంత్ర్యోద్యమం
పదవులు5 సార్లు ఎమ్మెల్యే
మరణం1980
బి.సుమిత్రాదేవి హైదరాబాదుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, దళిత నాయకురాలు, రాజకీయ నాయకురాలు మరియు సంఘసేవకురాలు. ఈమె అక్టోబరు 8, 1918న హైదరాబాదులో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, విమోచనోద్యమంలోనూ పాల్గొన్నారు. తర్వాత రాజకీయాలలో ప్రవేశించి 5 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. సుమిత్రాదేవి 1980లో మరణించారు.

స్వాతంత్ర్యోద్యమం, విమోచనోద్యమం:
1938-42లో సుమిత్రాబాయి వార్థా మహిళా ఆశ్రమంలో గ్రామసేవిక కోర్సు చేశారు. 1938లోనే సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదులో ఖాదీ ప్రచారం చేశారు. 1942లో స్టేట్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని అదే ఏడాది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. 1947-48లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని రజాకార్లపై పోరాడి జైలుకువెళ్ళారు. 1948 సెప్టెంబరులో నిజాం సంస్థానం భారతదేశంలో విమోచనం వరకు ఆమె కంటికి నిద్రలేకుండా కృషిచేశారు.

రాజకీయాలు:
హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం హైదరాబాదు నగరపాలక సంస్థ ఉపాధ్యక్షులైనారు. 1957 నుంచి ఈమె ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనది. ఈమె తొలిసారి 1957లో అప్పుడే కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి, 1962లో హైదరాబాదు తూర్పు నియోజకవర్గం నుండి, 1967 మరియు 1972 లో మేడ్చల్ నియోజకవర్గం నుండి, 1978లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.

విభాగాలు: హైదరాబాదు ప్రముఖులు, హైదరాబాదు రాజకీయ నాయకులు, 1918లో జన్మించినవారు, 1980లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక