26, నవంబర్ 2014, బుధవారం

కస్తూరి కృష్ణమాచార్యులు (Kasturi Krshnamacharyulu)

కస్తూరి కృష్ణమాచార్యులు
జననంఅక్టోబరు 10,1920
స్వగ్రామంచౌటుకూరు (మెదక్ జిల్లా)
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు
పదవులు2 సార్లు ఎమ్మెల్యే
కస్తూరి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు, రచయిత మరియు రాజకీయ నాయకుడు. ఈయన అక్టోబరు 10,1920మెదక్ జిల్లా చౌటుకూరు గ్రామంలో జన్మించారు. 1938లో విద్యార్థి దశలోనే వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన కృష్ణమాచార్యులు న్యాయవాద వృత్తిని చేపట్టి 1947-48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచనోద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.  ఉద్యమ సమయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు

హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం రాజకీయాలలో ప్రవేశించి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 1952లో రాజగోపాలపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, 1957లో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. ఈయన సంగారెడ్డిలోని మంజీర కళానికేతానికి అధ్యక్షులుగా పనిచేశారు. రచయితగా పేరుపొందిన కృష్ణమాచార్యులు "స్వాతంత్ర్యదీక్ష" గ్రంథాన్ని రచించారు.


విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, మెదక్ జిల్లా సమరయోధులు, మెదక్ జిల్లా రచయితలు, 1920లో జన్మించినవారు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక