13, నవంబర్ 2014, గురువారం

నలందా జిల్లా (Nalanda District)

 నలందా జిల్లా
రాష్ట్రంబీహార్
పరిపాలన కేంద్రంబీహార్ షరీఫ్
వైశాల్యం2355 చకిమీ
జనాభా (2011)28,72,523
నలందా జిల్లా బీహారు రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది పలు చారిత్రక ప్రాధాన్యత ప్రాంతాలు కలిగిన జిల్లా. భౌగోళికంగా బీహారులో మధ్యలో ఉన్న ఈ జిల్లా గంగానదికి దక్షిణాన ఉంది. 2355 చకిమీ భూభాగం, 25.72 లక్షల జనాభాను, 3 ఉప విభాగాలను, 20 బ్లాకులను కలిగియుంది. బిహార్ షరీఫ్ ఈ జిల్లా పరిపాలన కేంద్రము. 1976లో పాట్నా జిల్లా నుంచి వేరుపడి ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించిన నలందా జిల్లా బిహారి షరీఫ్ జిల్లాగా కూడా పిలువబడుతుంది. నలంద, పావపురి, రాజ్‌గిర్‌లు ఈ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు.

భౌగోళికం, సరిహద్దులు:
నలందా జిల్లా బీహారు రాష్ట్రంలో దాదాపుగా మధ్యలో ఉంది. ఈ జిల్లాకు తూర్పున శేక్‌పుర జిల్లా, ఉత్తరాన పాట్నా జిల్లా, పశ్చిమాన జెహనాబాద్ జిల్లా, ఆగ్నేయాన నవడా జిల్లా, నైరుతిన గయ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2355 చదరపు కిలోమీటర్లు.

నలంద శిథిలాలు
చరిత్ర:
నలందా జిల్లాలో పలు చారిత్రక ప్రాంతాలు కలవు. ఈ జిల్లాకు క్రీ.పూ.5వ శతాబ్ది నాటి ఘనచరిత్ర ఉంది. గౌతమ బుద్ధుడు, వర్థమాన మహావీరుడు, అశోకుడు లాంటి చరిత్ర ప్రసిద్ధులు నలందలో కొంతకాలం గడిపారు. క్రీ.పూ. రెండవ శతాబ్దిలో ఆచార్య నాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు. క్రీ.శ. 5వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని గుప్తులు పాలించారు. ఈ జిల్లాలో సముద్రగుప్తుని తామ్రశాసనం, కుమారగుప్తుని నాణెం లభించాయి. క్రీ.శ. 637లో చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం ఇక్కడే అభ్యసించాడు.గుప్తుల అనంతరం పాల రాజులు పాలించారు. క్రీ.శ. 12వ శతాబ్దిలో భక్తియార్ ఖిల్జీ దండయాత్రల సమయంలో నలంద విశ్వవిద్యాలయంతో పాటు అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం చేయబడింది. 16వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని బెంగాల్ నవాబులు ఏలారు. 1764 బాక్సార్ యుద్ధం తర్వాత ఈస్టిండియా పాలనలోకి వెళ్ళింది. 1912 వరకు బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత ఒరిస్సా-బీహార్ ప్రావిన్సులోకి, 1935లో కొత్తగా ఏర్పాటు చేసిన బీహారు ప్రావిన్సులోకి మారింది. స్వాతంత్ర్యానంతరం బీహారు రాష్ట్రంలో పాట్నా జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1972 నవంబరు 9వ బీహార్ షరీఫ్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయబడింది.

రాజ్‌గిర్ విశ్వశాంతి స్థూపం
జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 28,72, 523. భారతదేశంలోని 640 జిల్లాలలో ఈ జిల్లా 134వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 1220, స్త్రీ-పురుష నిష్పత్తి 921:1000గా ఉంది. 2001-11 దశాబ్దిలో జనాభా పెరుగుదల రేటు 21.18%గా నమోదైంది. అక్షరాస్యత శాతం 66.41%.

ఆర్థికం:
దేశంలోని వెనుకబడిన జిల్లాలలో ఇది ఒకటి. జిల్లా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఇటీవలే నలందలో ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయబడింది. చారుత్రిక ప్రాంతాలు ఉన్నందున పర్యాటకులు అధికసంఖ్యలో వస్తుంటారు. గంగానది పరీవాహక ప్రాంతంలోకి వచ్చే ఈ జిల్లాలో ఫాల్గు, మోహనె, జియరాన్, కుంభాని నదులు ఉత్తరం వైపుగా ప్రవహిస్తున్నాయి.

రవాణా సౌకర్యాలు:
జిల్లాలో 2 రైలు మార్గాలు పలు జాతీయ రహదారులు కలవు. సమీపంలో ఉన్న విమానాశ్రయం పాట్నా విమానాశ్రయం.

విభాగాలు: భారతదేశ జిల్లాలు, బీహారు, నలందా జిల్లా, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక