6, నవంబర్ 2014, గురువారం

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)

 రాజేంద్ర ప్రసాద్
జననండిసెంబరు 3, 1884
స్వస్థలంజిరాడి (బీహార్)
పదవులుతొలి రాష్ట్రపతి
మరణంమే 13, 1962
భారతదేశ తొలి రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ ఇప్పటి బీహార్ రాష్ట్రంలోని జిర్దేయొ గ్రామంలో డిసెంబరు 3, 1884న జన్మించారు. అభ్యసన దశలోనే జాతీయోద్యమంలో పనిచేశారు. వరదలు, భూకంపాల సమయంలో బాధితులకు సహాయాన్ని అందించారు. మొత్తం 3 సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారత రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షత వహించడమే కాకుండా 1950లో భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా నియామకం పొంది 1952, 1957లలో కూడా ఎన్నికై 1962 వరకు ఆ పదవిలో ఉన్నారు. ముద్దుగా బాబూగా పిలువబడే రాజేంద్రప్రసాద్ మే 13, 1962న పాట్నాలో మరణించారు. 1962లో ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది.

బాల్యం, విద్యాభ్యాసం:
భారతదేశ తొలి రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని  గ్రామంలో 1884, డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియన్ భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి రామాయణం నుండి కథలు వివరించేది. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అభ్యసిస్తున్నప్పుడు అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. సైన్సును వదిలి సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు. రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివశిస్తూ అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపారు.

స్వాతంత్ర్యోద్యమం:
1911లో రాజేంద్రప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. కాని కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 1916లో బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో చేరారు. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యారు.1918 లో 'సర్చ్ లైట్' అనే ఆంగ్ల పత్రికను ఆ తర్వాత 'దేశ్' అనే హిందీ పత్రికను నడిపారు.1921 లో మహాత్మాగాంధీ తో ఒకమారు సమావేశం తరువాత విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశారు. పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్‌లో చేర్చారు. 1924 లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించారు. రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947లో కృపాలానీ రాజీనామాతో మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును తొలి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 1952, 1957లలో కూడా రాష్ట్రపతి పదవికి ఎన్నికై 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. హిందీ, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేంద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ, ఇండియా డివైడెడ్, ఆత్మకథ, ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.

విభాగాలు: భారతదేశ రాష్ట్రపతులు, భారత రాజ్యాంగము, భారతదేశ స్వాతంంత్ర్య సమరయోధులు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, బీహార్ ప్రముఖులు, 1884లో జన్మించినవారు, 1962లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక