ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు "నేతాజీ"గా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ప్రస్తుత ఒడిషాలోని కటక్ నగరంలో జన్మించాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసావాదంతో స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ప్రసిద్ధి చెందాడు. మొత్తంపై అతివాద భావాలతో ఈయన చేసిన స్వాతంత్ర్యపోరాటం శ్లాఘనీయమైనది. మరణం కూడా వివాదాస్పదమైంది. ఆగస్టు 18, 1945న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. 1992లో బోస్‌కు "మరణానంతరం" అని ప్రకటించిన భారతరత్న పురస్కారం కూడా ఇదే కారణంతో ఆయన కుటుంబీకులు స్వీకరించనందును ఆయనకు ప్రకటించిన భారతరత్నను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించినా దేశ స్వాతంత్ర్యం కోసం ఆ పదవిని వదిలి జాతీయోద్యమంలో చేరాడు. సుభాష్ చంద్రబోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ సిద్ధాంతాలతో విబేధించి కాంగ్రెస్‌ను వదిలిపెట్టి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన పిదప ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. రెండో ప్రపంచయుద్ధం చివరికాలంలోనే విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
12, జులై 2019, శుక్రవారం
సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి