14, డిసెంబర్ 2014, ఆదివారం

రాజ్‌కపూర్ (Raj Kapoor)

రాజ్‌కపూర్
జననం14 డిసెంబరు, 1924
జన్మస్థానంపెషావర్
రంగంసినీనటుడు
అవార్డులుదాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1987), పద్మభూషణ్ (1971)
మరణంజూన్ 2, 1988
హిందీ చలనచిత్ర పరిశ్రమలో "ది షో-మాన్"గా ప్రసిద్ధిచెందిన ప్రముఖ నటుడు రాజ్ కపూర్ 14 డిసెంబరు, 1924 న పెషావర్‌లో జన్మించారు. ఇతను తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు జాతీయ ఫిలిం అవార్డులు పొందారు. ఇతని చిత్రాలు ఆవారా (1951) మరియు బూట్ పోలిష్ (1954) అనేవి కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్మే డి ఓర్ కొరకు నామినేట్ అయ్యాయి. భారతీయ చలనచిత్ర రంగానికి రాజ్‌కపూర్ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1971లో పద్మ భూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. 1987లో భారత చలనచిత్ర రంగంలో అత్యుత్తమమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. జూన్ 2, 1988న రాజ్‌కపూర్ మరణించారు.

వివాహం, బంధుత్వం:
రాజ్‌కపూర్ కృష్ణ కపూర్‍ను వివాహం చేసుకున్నారు. కపూర్ ప్రసిద్ధ నటి నర్గీస్‍తో 1950లలో సుదీర్ఘ ప్రేమాయణం సైతం నడిపారు. కపూర్ యొక్క మనవళ్ళు/మనవరాళ్ళలో ముగ్గురు ప్రస్తుతం బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు. అతడి మనవరాళ్ళు కరిష్మా కపూర్ మరియు కరీనా కపూర్, రాజ్ కుమారుడైన రణ్‍ధీర్ కపూర్ మరియు అతడి భార్య బబితల కుమార్తెలు. అతడి మనవడు రణ్‍బీర్‍ కపూర్, రిషి కపూర్ మరియు అతడి భార్య నీతూ సింగ్‍ల కుమారుడు.విభాగాలు: భారతదేశ చలనచిత్ర ప్రముఖులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, 1924లో జన్మించినవారు, 1988లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక