మహబూబాబాదు మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. ప్రముఖ తెలుగు చిత్రకారుడు, సమరయోధుడు కొండపల్లి శేషగిరిరావు, సంగీత దర్శకుడు చక్రధర్ గిల్లా (చక్రి) ఈ మండలానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గూడూరు మండలం, తూర్పున బయ్యారం మండలం, దక్షిణాన కురవి మండలం, పశ్చిమాన నెల్లికుదూరు మండలం, నైరుతిన చిన్నగూడూరు మండలం, వాయువ్యాన కేసముద్రం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 113535. ఇందులో పురుషులు 57177, మహిళలు 56358. మండలంలో పట్టణ జనాభా 42717, గ్రామీణ జనాభా 70818.
రాజకీయాలు:
ఈ మండలము మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన భూక్యా మౌనిక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన లాలావత్ ప్రియాంక ఎన్నికయ్యారు. కాలరేఖ:
మహబూబాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ammangal, Anantharam, Bethole, Chengapuram, Edulapusapalli, Gumudur, Jamandlapalli, Jangligonda, Khambhalpalli, Laxmipur, Madhavpuram, Mahabubabad, Mallial, Mudupugal, Nadiwada, Parvathagiri, Reddial, Shingaram, V.S.Lakshmipur, Vemnoor
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అనంతారం (Anataram): అనంతారం మహబూబాబాదు జిల్లా మహబూబాబాదు మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రం నుంచి 2 కిమీ దూరంలో ఉంది. గ్రామ శివారులో అనంతాద్రి దేవాలయం ఉంది. ఇక్కడ స్వయంభూ జగన్నాథస్వామి కొలువై ఉన్నారు. ఇది పర్యాటకక్షేత్రంగా విరాజిల్లుతోంది. కంబాలపల్లి (Kambalapalli): కంబాలపల్లి మహబూబాబాదు జిల్లా మహబూబాబాదు మండలమునకు చెందిన గ్రామము. సంగీత దర్శకుడు చక్రి (చక్రధర్ గిల్లా) ఈ గ్రామానికి చెందినవారు. ఈయన డిసెంబరు 15, 2014న 40 ఏళ్ళ చిన్న వయస్సులోనే మరణించారు. మహబూబాబాదు (Mahabubabad): మహబూబాబాదు జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గ కేంద్రము కూడా ఉంది. జిల్లాల పునర్విభజన సమయంలో 2016లో ఇది జిల్లా కేంద్రంగా మారింది. అంతకు క్రితం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. పెనుకొండ (Penukonda): పెనుకొండ మహబూబాబాదు జిల్లా మహబూబాబాదు మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ తెలుగు చిత్రకారుడు, సమరయోధుడు కొండపల్లి శేషగిరిరావు స్వగ్రామం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mahabubabad Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి