14, ఫిబ్రవరి 2015, శనివారం

పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru Ettipothala Scheme)

పాలమూరు ఎత్తిపోతల పథకం
రాష్ట్రంతెలంగాణ
లబ్ది పొందే జిల్లాలుమహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ
తెలంగాణలోని 3 జిల్లాలలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించిన ప్రణాళికే ఆలమూరు ఎత్తుపోతల పథకం. 70 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసి) నీటిని కృష్ణా జలాలను జూరాల బ్యాక్‌వాటర్ నుంచి మళ్ళించడమే ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం మూడు దశలలో కొనసాగుతుంది. మొదటిదశలో భాగంగా జూరాల బ్యాక్ వాటర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం కాలువ త్రవ్వుతారు. దీనిసామర్థ్యం 26 వేల క్యూసెక్కులు. తర్వాత 23 కిమీ దూరం రెండు సొరంగమార్గాలు త్రవ్వుతారు. కోయిల్‌సాగర్ ఎగువభాగంలో కోయిలకొండ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మిస్తారు. దీనిసామర్థ్యం 76 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల 22 గ్రామాలు ముంపునకు గురవుతాయి. రిజర్వాయర్ నుంచి 170 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్ళి 1.75 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు.
రెండోదశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఒక రిజర్వాయర్, రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో మరో రిజర్వాయర్ నిర్మిస్తారు. రెండో రిజర్వార్‌కు 465 మీటర్ల ఎత్తుకు, మూడో రిజర్వాయర్‌కు 675 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళతారు.
ఈ పథకం వల్ల మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 56 మండలాలలోని ఆయకట్టుకు నీరందుతుంది.

విభాగాలు: తెలంగాణ నీటి పథకాలు, మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక