మహారాణి అహల్యాబాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. ఈమె 31 మే 1725న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా చొండి గ్రామంలో జన్మించింది. 1767 నుంచి 1795 వరకు ఇండోర్ రాజ్యాన్ని పాలించింది. తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈమె సేవలకు గుర్తింపుగా ఇండోర్ విమానాశ్రయానికి అహల్యాబాయి విమానాశ్రయంగా పేరుపెట్టబడింది.
ఇండోర్ రాణిగా: అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ (మల్హర్ రావ్ హోల్కర్ కుమారుడు) 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకొని అహల్యాబాయికి యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యాబాయి స్వీకరించి 1795 వరకు ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించింది. థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి ఇతర దుండగుల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నాలు చేసింది. కాలువలు , చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడింది. తుకోజీరావ్ హోల్కర్‌ను సేనానాయకునిగా నియమించి పలు యుద్ధాలలో ముందుండి సైన్యాన్ని నడిపించింది. ధార్మిక కార్యక్రమాలు: రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కింది. తన రాజ్యానికి ఆవల తూర్పున ద్వారక (గుజరాత్) నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మించింది. సోమనాథ్ లో సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించింది. 13 ఆగస్టు 1795న అహల్యాబాయి మరణించింది. గుర్తింపులు: భారతదేశ సంస్కృతికి ఈమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అహల్యాబాయి పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా పేరుపెట్టబడింది. అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలగా రచించాడు.
= = = = =
|
3, మార్చి 2015, మంగళవారం
అహల్యాబాయి హోల్కర్ (Ahilyabai Holkar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి