28, మార్చి 2015, శనివారం

శ్యాంప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee)

శ్యాంప్రసాద్ ముఖర్జీ
జననంజూలై 6, 1901
రంగంజాతీయోద్యమం, రాజకీయాలు,
పదవులువైస్ ఛాన్సలర్, కేంద్రమంత్రి,
మరణంమే 23, 1953
ప్రముఖ జాతీయవాదిగా పేరుపొందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901, జూలై 6న జన్మించారు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1949 లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినారు.

ప్రారంభ జీవితం:
శ్యాంప్రసాద్ ముఖర్జీ జూలై 6, 1901 న కోల్‌కతలో జన్మించారు. తండ్రి అశుతోష్ ముఖర్జీ బెంగాల్‌లో గౌరవాదరణ కలిగిన న్యాయవాది మరియు కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన ప్రముఖుడు. తల్లి పేరు జోగ్‌మాయా దేవి ముఖర్జీ. ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్‌కతలోనే కొనసాగింది. 1921లో ఆంగ్లంలో మొదటి స్థానంలో పట్టా పుచ్చుకున్నారు. 1923 లో ఎంఏ పట్టా, 1924 లో న్యాయవాద పట్టా కూడా స్వీకరించినాడు. ఇంగ్లాండు నుంచి 1927 లో బారిష్టరు పట్టా పొందినారు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయపు కులపతిగా నియమించబడి, పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత పొందినారు.

కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా
రాజకీయ జీవితం:
ముఖర్జీ తొలుత భారతీయ జాతీయ కాంగ్రెసు తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టినారు. అనతికాలంలోనే హిందువుల తరఫున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందూమహాసభలో ప్రవేశించి 1944 లో ఆ సంస్థ అధ్యక్షుడైనారు. ముఖర్జీ ముస్లిములకు వ్యతిరేకి కాకున్ననూ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకొనే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించారు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మతకలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించారు.

స్వాతంత్ర్యానంతరం:
జవహర్ లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో ముఖర్జీకి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వశాఖను కేటాయించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ మరియు భారతీయ జాతీయ కాంగ్రెసు ఇతర నాయకులచే ముఖర్జీ మంచి గౌరవప్రథమైన వ్యక్తిగా గుర్తింపుపొందారు. 1949 లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌ తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రిపదవికి రాజీనామా సమర్పించాడు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ఎం.ఎస్.గోల్వార్కర్ తో చర్చలు జరిపిన అనంతరం అక్టోబరు 21, 1951న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించారు. నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్చా మార్కెట్ విధానానికి మద్దతు పలికింది. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌరస్మృతి ఉండాలని ఉద్ఘాటించింది. గోహత్య మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నారు.

గుర్తింపులు:
  • ఆగస్టు 27, 1998నాడు అహ్మదాబాదు కార్పోరేషన్‌చే ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టబడింది.
  • 2001 లో భారత పరిశోధనా సంస్థ అయిన CSIR ముఖర్జీ పేరిట ఫెల్లోషిప్‌ను స్థాపించింది.

విభాగాలు: కోల్‌కత ప్రముఖులు, జాతీయోద్యమ నాయకులు, 1901లో జన్మించినవారు, కేంద్రమంత్రులు, 1953లో మరణించినవారు, హిందూ జాతీయవాదులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • ప్రసిద్ధ భారతీయులు,
  • www.shyamaprasad.org
  • బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక