25, ఏప్రిల్ 2015, శనివారం

దోమకొండ సంస్థానము (Domakonda Samsthan)

దోమకొండ సంస్థానము
స్థాపనక్రీ.శ.15వ శతాబ్ది
వంశంకామినేని
చివరి పాలకుడురెండవ రాజా సోమేశ్వరరావు
తెలంగాణలోని ప్రాచీన సంస్థానాలలో ఒకటైన దోమకొండ సంస్థానం క్రీ.శ.15వ శతాబ్దిలో ప్రారంభమై హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమయ్యే వరకు కొనసాగింది. ఈ సంస్థానానికి మూలం బిక్కవోలు సంస్థానం. ఇది ఇప్పటి మెదక్ జిల్లాలో ప్రారంభమై ఆ తర్వాత రాజధానిని కామరెడ్డికి మార్చారు. చివరికి దోమకొండకు మారి సంస్థానం రద్దయ్యే వరకు అదే రాజధానిగా పనిచేసింది. దోమకొండ సంస్థానాధిపతులు కామినేని వంశస్తులు.

దోమకొండ సంస్థానాధీశులు మొదట బహుమనీ సుల్తానులకు దుర్గాధిపతులుగా ఉండి తర్వాత స్వతంత్ర సంస్థానంగా ప్రకటించుకున్నారు. కుతుబ్ షాహీలు, ఆసఫ్‌జాలకు సామంతులుగా పరిపాలన సాగించారు.

సంస్థాన మూలపురుషుడు కామినేని చౌదరి కుమారుడు కాచారెడ్డి. క్రీ.శ.15వ శతాబ్దిలో ఇతను మొదట ప్రస్తుత కర్ణాటక ప్రాంత దుర్గాధిపతిగా ఉండి, తర్వాత బహుమనీ సుల్తాను కోరిక మేరకు బిక్కనవోలు సంస్థాన పాలకునిగా చేరాడు. ఈతడే బిక్కనవోలు సంస్థానాన్ని అభివృద్ధి పరిచాడు. ఈతని తర్వాత భోగిరెడ్డి, రెండవ కాచారెడ్డి, మొదటి ఎల్లారెడ్డి, మూడవ కాచరెడ్డి, రెండవ కామిరెడ్డి, చిన కామిరెడ్డి, పోతారెడ్డి, జోగారెడ్డి, పోతారెడ్డి -2 అనువారు వరుసగా బిక్కనవోనులు పాలించారు. రాజన్న చౌదరి కాలంలో సంస్థాన కేంద్రం బిక్కనవోలు నుండి రామిరెడ్డికి మారింది.

రాజేశ్వరరావు తర్వాత పెద్ద రాజేశ్వరరావు సంస్థాన పాలకుడయ్యాడు. ఇతను గోల్కొండ పాలకుడైన నిజాం అలీఖాన్‌కు విశ్వాసపాత్రుడు. నవాబును ఎదిరించిన చెన్నూరు, పాల్వంచ మొదలగు సంస్థానాధీశులను ఓడించి నవాబుచే చంద్రహాస, అంగుళీయాదికముల బహుమానం పొందారు. దోమకొండ సంస్థానంలో ఘనకీర్తిని సంపాదించిన వాడు సోమేశ్వరరావు. నైజాం ప్రభువు సోమేశ్వరరావును 'మహా బలవంత' అనే బిరుదుతో సత్కరించాడు. దోమకొండ సంస్థానాధీశులలో గొప్పదాత. తులాభారం తూగి ఆ ధనమంతా పేదలకు పంచి పెట్టినవాడు ఉమాపతిరావు.

దోమకొండ కోటలోని ఆలయం
దోమకొండ సంస్థాన పాలకులలో చివరివాడు రెండవ రాజా సోమేశ్వరరావు. ఈ సంస్థాన పాలన భారతదేశంలో జాగీర్లు రద్దు చేసేవరకు కొనసాగింది. దాదాపు 400 ఏళ్ళ పైబడి పరిపాలన చేసిన దోమకొండ సంస్థానాదీశులు అనేక ధర్మకార్యాలు చేయటమే కాక వ్యవసాయ అభివృద్ధి కోసం కొత్త చెరువులు నిర్మించారు. అనేక కొత్త గ్రామాలు నిర్మించారు. తెలుగు సాహిత్య సేవ చేశారు.

దోమకొండ సంస్థానాధీశుల పాలనకు మెచ్చి నైజాం రాజు హైదరాబాదులోని నాంపల్లి దగ్గర ఉమాబాగ్ అనే 30 ఎకరాలు ఇనాంగా ఇచ్చాడు. సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయింది. దాంతో కామినేని వంశస్థులు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.


హోం,
విభాగాలు: తెలంగాణ సంస్థానాలు, నిజామాబాదు జిల్లా చరిత్ర, దోమకొండ సంస్థానము,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక