25, ఏప్రిల్ 2015, శనివారం

గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)

గడ్డం ప్రసాద్ కుమార్
జననంజూన్ 4, 1964
స్వస్థలంమర్పల్లి
పదవులురాష్ట్రమంత్రి,
గడ్డం ప్రసాద్ కుమార్ 1964 జూన్ 4న తాండూరులో జన్మించారు. ఈయన స్వగ్రామం మర్పల్లి. హైస్కూలు విద్య తాండూరులోని విలియం మూన్, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలో జరిగింది. డిగ్రీ మధ్యలో ఆగిపోయింది. 1984-85లో NSUI విధ్యార్థి విభాగం అధ్యక్షుడైనారు. 1992లో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, 1998లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షపదవి పొందారు. 2002లో పార్టీ జిల్లా  ప్రధాన కార్యదర్శి, 2003లో పార్టీ జిల్లా కో-చైర్మెన్ అయ్యారు. 2001-6 కాలంలో మర్పల్లి ఎంపీపీగా, 2008లో వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు విజయం సాధించారు. 2009లో మళ్ళీ అదేస్థానం నుంచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు. శాసనసభలో ఎస్సీ సంక్షేమ కమిటి చైర్మెన్‌గా పనిచేశారు. 2012 ఫిబ్రవరి 6న కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెరాస అభ్యర్థి సంజీవరావు చేతిలో ఓడిపోయారు.

కుటుంబం:
ప్రసాద్ కుమార్ చిన్న వయస్సులో  ఉన్నప్పుడే తండ్రి మరణించారు. తల్లి ఎల్లమ్మ 1982లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాండూరు మున్సీపాలిటీ కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడీపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా)కి ఇతను మేనల్లుడు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక