6, ఏప్రిల్ 2015, సోమవారం

ఖమ్మం ఖిల్లా (Khammam Fort)

 ఖమ్మం ఖిల్లా
నగరంఖమ్మం
నిర్మాణ కాలంక్రీ.శ. 950
చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఖమ్మం కోట ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల కాలంలో క్రీ.శ. 950లో ఖమ్మం కోట నిర్మాణానికి పునాదులు పడ్డాయి. తరువాత రెడ్డిరాజులు, వెలమరాజులు, కుతుబ్‌షాహీలు ఈ కోటను మెరుగుపర్చారు.

చరిత్ర:
కాకతీయుల కాలంలో రంగారెడ్డి, లక్నారెడ్డి, వేమారెడ్డి అనే ముగ్గురు సోదరులు తమకు లభించిన గుప్తధనంతో క్రీ.శ.950లో కోట నిర్మాణం ప్రారంభించినట్లు చరిత్ర ప్రకారం తెలుస్తుంది. తొలుత అది మట్టికోట. క్రీ.శ.1006లో కోట నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన తర్వాత ౩౦౦ సంవత్సరాల పాటు రెడ్డి వంశాల పాలనలో ఉండగా ఆ తరువాత వెలమరాజుల చేజిక్కించుకొన్నారు. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ కోట కూడా అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది.

వెన్నెలలో ఖమ్మం కోట
కోట విశిష్టత:
గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు మరియు మహలు ఉన్నవి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న పెద్ద బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నవి.
 
ఇవి కూడ చూడండి:
  • తెలంగాణ కోటలు,
  • ఖమ్మం నగరం,


హోం,
విభాగాలు:
తెలంగాణ కోటలు, ఖమ్మం జిల్లా సందర్శనీయ ప్రదేశాలు, ఖమ్మం నగరం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక